https://oktelugu.com/

Group-1 Results : గ్రూప్‌–1 ఫలితాల విడుదలకు తొలగిన అడ్డంకులు.. కీలక తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు..!

నిరుద్యోగులు పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. గత టీఎస్‌పీఎస్సీ ఏ పరీక్ష నిర్వహించిన జాప్యం జరుగుతూనే వస్తోంది. టీఎస్‌పీఎస్సీ వైఫల్యం కారణంగానే ఇలాంటి పరిస్థితి. ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీని టీజీపీఎస్సీగా మార్చింది. గతంలో వాయిదా పడిన గ్రూప్‌–1 పరీక్షలు నిర్వహించింది.

Written By: , Updated On : February 4, 2025 / 11:07 AM IST
Group-1 Results

Group-1 Results

Follow us on

Group-1 Results : తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ టీజీపీఎస్సీ అలియాస్‌ టీఎస్‌పీఎస్సీ.. గతంలో అనేక పర్యాయాలు వాయిదా వేస్తూ వచ్చిన గ్రూప్‌–1 పరీక్షలు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక నిర్వహించింది. ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించింది. అయితే ఫలితాల ప్రకటనపై కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రెండు పిటిషన్లు దాఖలు కాగా, ఆ రెండింటిని కొట్టేసింది. దీంతో ఫలితా విడుదలకు లైన్‌ క్లియర్‌ అయింది. పరీక్షలపై వివిధ రకాల అభ్యంతరాలతో కొంతమంది అభ్యర్థులు దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పిటిషన్లపై సోమవారం(ఫిబ్రవరి 3న) విచారణ జరిపిన న్యాయమూర్తి పిటిషన్లను కొట్టేసి ఫలితాల విడుదలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. గతంలో గ్రూప్‌–1 ఫలితాలపై రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడ కూడా వారి పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన సుప్రీం కోర్టు ఫలితాల వెల్లడికి అనుమతి ఇచ్చింది. దీంతో తెలంగాణ ఏర్పడిన 11 ఏళ్లలో గ్రూప్‌–1 ఫలితాలు విడుదల కానుండడం విశేషం.

గతేడాది మెయిన్స్‌..
ఇదిలా ఉంటే గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షను అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు నిర్వహించారు. మొత్తం 563 పోస్టులకు 31,403(క్రీడల కోటా కలిపి) మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. అయితే జీవో 29ను రద్దు చేయాలని, గ్రూప్‌–1 పరీక్ష మెయిన్స్‌ పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థించింది. గ్రూప్‌–1 అభ్యర్థులు ఆందోళనలు కూడా చేశారు. ఇవి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి రాజకీయ పార్టీలు సైతం మద్దతు తెలుపడంతో ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. హైదరాబాద్‌ నగరంలో లాఠీ చార్జ్‌ సైతం జరిగింది. పెద్ద ఎత్తున నిరసన తెలిపిన అభ్యర్థులు తర్వాత హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ వారికి ఎదురు దెబ్బ తగిలింది. సోమవారం విచారణ జరిపిన కోర్టు ఫలితాల విడుదలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.