Summer Holidays 2025: ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు(Tempareture) నాలుగైదు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతన్నాయి. ఇక మార్చి మొదటి వారంలోనే 40 డిగ్రీలకు చేరువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పాఠశాలలకు మార్చి 10 నుంచి ఒంటిపూట నిర్వహించాలని భావిస్తున్నాయి. మరోవైపు వేసవి సెలవులపై కూడా నిర్ణయం తీసుకున్నాయి.
Also Read: గుండెపోటుతో పెంపుడు కుక్క మృతి..బోరున విలపించిన మంత్రి సురేఖ.. వైరల్ వీడియో
తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ్గుమంటున్నాడు. మార్చి మొదటి వారంలోనే 40 డిగ్రీలకు చేరువగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు వేడి, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు పాఠశాలల విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వాలు ఒంటిపూట బడులను ఈనెల 10 నుంచే నిర్వహించాలని నిర్ణయించాయి. ఈమేరకు నేడో రేపో అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. మరోవైపు తల్లిదండ్రుల నుంచి కూడా వినతులు వస్తున్నాయి. దీంతో పాఠశాలల ఒంటిపూటపై నిర్ణయం వెలువడనుంది. ఇక వేసవి సెలవుల(Summer Holydays)పైనా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. తెలంగాణలో 2025లో పాఠశాలలకు వేసవి సెలవులు ఏప్రిల్ 23 నుంచి ప్రారంభమవుతాయి. ఈ విషయం మార్చి 6, 2025న విద్యాశాఖ(Educationa Department) ఆదేశాల ద్వారా ప్రకటించబడింది. అయితే, సెలవులు ఎన్ని రోజులు ఉంటాయో కచ్చితమైన వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు, కానీ సాధారణంగా ఇవి మే నెల వరకు లేదా జూన్ మొదటి వారం వరకు కొనసాగవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా వేసవి సెలవుల గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు, కానీ 2024లో ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు సెలవులు ఇచ్చారు. ఈ ఆధారంతో, 2025లో కూడా ఇలాంటి తేదీలు (ఏప్రిల్ చివరి వారం నుంచి జూన్ మధ్య వరకు) ఉండే అవకాశం ఉంది.
ఏప్రిల్ 23 లాస్ట్ వరి‍్కంగ్‌డే..
అయితే విద్యా సంవత్సరం పనిదినాలు పూర్తి కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వేసవి సెలవులను ముందుకు జరిపే అవకాశం లేదు. ముందుగా నిర్ణయించిన విద్యా ప్రణాళిక ప్రకారమే ఏప్రిల్ 23న చివరి పని దినంగా విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. వాతావరణ శాఖ సూచనలు పాటిస్తూ పాఠశాలలను నిర్వహిస్తామని పేర్కొంటున్నారు. తెలంగాణలో ఏప్రిల్ 24 నుంచి సెలవులు మొదలవుతాయని స్పష్టం చేశారు. ఏపీలోనూ ఇదే నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది.