https://oktelugu.com/

Elon Musk: అసలే పైసల పిచ్చోడు.. ఆపై తిక్కలోడు.. మస్క్ చేస్తున్న ప్రయోగాలతో మానవాళికి ముప్పు..

సాంకేతికత పెరుగుతున్న కొద్దీ యాంత్రికరణ రెట్టింపు అవుతోంది. దీనివల్ల మనుషుల్లో శారీరక శ్రమ తగ్గుతోంది. యంత్రాలతో.. ఎలక్ట్రానిక్ పరికరాలతో గడపడం పెరుగుతోంది. దీనివల్ల మనుషుల్లో అనేక రకాలైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చిత్ర విచిత్రమైన రుగ్మతలు దాడి చేస్తున్నాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : October 17, 2024 / 09:32 AM IST

    Elon Musk

    Follow us on

    Elon Musk: శారీరక శ్రమ తగ్గించడానికి శాస్త్రవేత్తలు యంత్రాలను కనిపెడుతున్నారు. అయితే యంత్రాన్ని మనిషి నియంత్రించినంతవరకు కొద్దిగా సమస్య ఉండదు. కానీ ఆ యంత్రాలు మనుషులను ప్రభావితం చేస్తే ప్రపంచమే ఇబ్బందుల్లో పడుతుంది. మానవాళి మనుగడ ముప్పును ఎదుర్కొంటుంది. ట్విట్టర్ ఎక్స్ అధినేత, టెస్లా యజమాని ఎలన్ మస్క్ చేస్తున్న ప్రయోగాలు మనిషి మనుగడను ప్రమాదంలో పడేసే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అనేక రకాల ప్రయోగాలతో మస్క్ ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాడు. ప్రపంచ కుబేరుడిగా అవతరించాడు. ఇక తాజాగా మస్క్ వి. రోబోట్ పేరుతో రెండు వాహనాలతో పాటు, రోబోట్లను ఆవిష్కరించాడు. ఆ కార్ల విషయం కాస్త పక్కన పెడితే.. ఆ రోబోట్లు అన్ని పనులు చేస్తున్నాయి. చివరికి “ఆ పని” కూడా రోబోట్ లు చేస్తాయట. దానికి తగ్గట్టుగానే పరిశోధనలు కూడా చేస్తున్నారట. ఒకవేళ ఇది అందుబాటులోకి వస్తే అంతకు మించిన విపత్తు మరొకటి ఇంకేం ఉంటుంది?

    ఇప్పటికే మనుషులు “సెల్” బంధీలైపోయారు. సెల్ ఫోన్ చూడకుండా క్షణకాలం కూడా గడప లేని పరిస్థితికి దిగజారి పోయారు. ఇప్పుడు ఇలా ఉంటే.. మనిషి జీవితాన్ని రోబోలు కనుక టేక్ ఓవర్ చేస్తే పరిస్థితి ఏంటి? ఇప్పటికే రోబోల వినియోగం వల్ల మానవ వనరుల వినియోగం తగ్గిపోతుంది. నిరుద్యోగం తారాస్థాయికి చేరుతోంది. కృత్రిమ మేథ రోబోలకు ఆపాదించడం వల్ల అవి మనుషులు చేసే అన్ని పనులను నిర్వర్తించగలుగుతాయి. అలాంటప్పుడు భవిష్యత్తులో మనుషులతో ఎలాంటి అవసరం ఉండదు. అప్పుడిక మొత్తం రోబో లే వ్యవహారాలు చక్కబడతాయి.

    యాంత్రీకరణ పెరిగిపోవడం వల్ల వచ్చే రోజుల్లో స్త్రీ, పురుషులు తమ శారీరక అవసరాల కోసం రోబోల మీద ఆధారపడతారు. ఇప్పటికే పలు నివేదికలు ఈ విషయాలను వెల్లడించాయి. పురుషులు, స్త్రీలు తమ లైంగిక కోరికలను తీర్చుకోవడం కోసం రోబోల మీద ఎక్కువగా ఆధారపడటం, ఇష్టపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇక 2050 నాటికి సాధారణ శృంగారం కంటే రోబోల ద్వారా చేసే ” ఆ పని” ఒక సాధారణ ప్రక్రియ అవుతుందని.. అప్పుడు మనుషుల ప్రేమ, వాత్సల్యం క్రమేపీ మరుగున పడతాయని వార్తలు వినిపిస్తున్నాయి.. అందువల్లే.. అంతటి దారుణం చోటు చేసుకోక ముందే..” యంత్రాలను వాడుకోవాలి.. మనుషులను ప్రేమించాలి” అనే కొటేషన్ ను భూమి మీద ఉన్న మనుషులు పాటించాలని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టెక్నాలజీ మోజులో పడి..మస్క్ లాంటి పైసల పిచ్చోళ్ళు చేసే ఉత్పత్తుల మాయలో పడి మనుషులు తమ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని హితవు పలుకుతున్నారు.