spot_img
Homeఆధ్యాత్మికంSri Rama Navami 2026: మరో మూడు రోజుల్లో శ్రీరామనవమి.. గుర్తింపు కోసం కోర్టుకు రామచంద్రుడు.....

Sri Rama Navami 2026: మరో మూడు రోజుల్లో శ్రీరామనవమి.. గుర్తింపు కోసం కోర్టుకు రామచంద్రుడు.. ఏంటా కథ!

Sri Rama Navami 2026: మనదేశంలో.. ముఖ్యంగా దక్షిణాది ప్రాంతంలో ఒక మనిషి పేరుకు ముందు ఇంటి పేరు ఉంటుంది. ఆ తర్వాత కులం.. అనంతరం గోత్రం ఉంటుంది.. ఇది ఇప్పటిది కాదు.. తరతరాలుగా సాగుతూ వస్తోంది. కులాన్ని.. గోత్రాన్ని కొంతమంది వ్యతిరేకించినప్పటికీ.. చాలామంది నేటికీ అనుసరిస్తూనే ఉంటారు..

కులాలు.. గోత్రాలు కేవలం మనుషులకు మాత్రమే కాదు.. దేవతామూర్తులకు కూడా ఉంటాయి. దేవతామూర్తులకు కులాలను.. గోత్రాలను ఆపాదించడం ఈనాటిది కాదు.. దాని వెనక ఏళ్ల చరిత్ర ఉంది. ఆయా దేవుళ్లను వివిధ కులాలవారు ఆపాదించుకోవడం పరిపాటిగా మారింది.

ఇప్పటివరకు కులాలు.. గోత్రాల విషయంలో ఏ దేవుళ్ళు కూడా ఇబ్బంది పడిన దాఖలాలు లేవు. వివాదాస్పదమైన సందర్భాలు కూడా లేవు. అయితే తొలిసారిగా ఇటువంటి ఇబ్బందులు శ్రీ సీతారామ చంద్రుడు ఎదుర్కొంటున్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికి నిజం. సీతారామ చంద్రుడికి ఆస్థాయిలో ఇబ్బంది ఎందుకు కలిగింది.. గోత్రం విషయంలో స్వామివారు ఎందుకు కోర్టు మెట్లు ఎక్కారు.. ఈ ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.

భద్రాద్రి రామయ్య గోత్రం వశిష్ట. సీతమ్మది గౌతమస గోత్రం. ఈ గోత్రాల పేర్లను చదువుతూ అర్చకులు పూజలు చేస్తూ ఉంటారు. 2012 తర్వాత పండితులు స్వామివారిని అచ్యుత.. అమ్మవారిని సౌభాగ్య గోత్రాలుగా చదువుతున్నారు. ఈ మార్పు వెనుక ఉద్దేశం ఏమిటో తెలియదు. అయితే సీతారామ చంద్రుల గోత్రాలను 2012 నుంచి మార్చి చదువుతున్నారని ఓ భక్తుడు కోర్టు దాకా వెళ్లాడు.

2022లో తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు. కోర్టు ఆదేశాల మేరకు ఒక కమిటీ ఏర్పాటు అయింది. ఆ కమిటీ దేవాదాయ శాఖకు నివేదిక ఇచ్చింది. అయితే ఆ నివేదికను దేవాదాయ శాఖ బయట పెట్టలేదు. దీంతో ఆ వ్యక్తి మళ్ళీ కోర్టును ఆశ్రయించాడు. దీనిపై హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ సున్నితమైన వివాదంపై కోర్టు ఎలా విచారిస్తుంది? ఎటువంటి తీర్పు ఇస్తుంది అనేది చూడాల్సి ఉంటుంది.

సీతారామచంద్రస్వామికి మరో మూడు రోజుల్లో కళ్యాణం.. మరో నాలుగు రోజుల్లో పట్టాభిషేకం జరుగుతాయి. ఇంతటి మహత్కార్యాల ముందు స్వామివారు గోత్రానికి సంబంధించి వివాదం ఎదుర్కోవడం.. అది కూడా కోర్టు దాకా వెళ్లడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. స్వామివారి గోత్రాలను మార్చి ఎందుకు చదువుతున్నారు.. గతంలో చదివిన వాటిని ఎందుకు పక్కన పెట్టారు.. అనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లభించలేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...

Talliki Vandanam Scheme 2026: తల్లికి వందనం.. రూ.13 వేలు జమ.. చెక్ చేసుకోండి!

Talliki Vandanam Scheme 2026: ఏపీ ప్రభుత్వం ఈరోజు ప్రతిష్టాత్మక పథకానికి సంబంధించి నిధులు జమ చేయనుంది. పాఠశాలతో పాటు ఇంటర్ విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద చదువుకు సాయం అందించనుంది....

NEET Protest Delhi: ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు: ఆ సీజేపీ నాయకులు ఎక్కడ..

NEET Protest Delhi: ఒకరేమో ఆర్టికల్ 370 రద్దు చేయాలి అంటారు. మరొకరేమో రాముడి నామాన్ని జపించకూడదు అంటారు. ఇంకొకరేమో జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి మరింత స్వేచ్ఛ వాయువులు కల్పించాలని డిమాండ్...

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...
Oktelugu Epaper
Exit mobile version