spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Putta Mahesh Drug Allegations: పుట్టా మహేష్ డ్ర*గ్స్ తీసుకోలేదా? పుట్టా సుధాకర్ చెబుతున్న దాంట్లో...

Putta Mahesh Drug Allegations: పుట్టా మహేష్ డ్ర*గ్స్ తీసుకోలేదా? పుట్టా సుధాకర్ చెబుతున్న దాంట్లో ఎంత నిజం?

Putta Mahesh Drug Allegations: తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మొయినాబాద్ వ్యవసాయ క్షేత్రంలో జరిగిన మాదక ద్రవ్యాల పార్టీలో కీలకమైన విషయాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ కేసు మరో మలుపు తీసుకుంది. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్ లేవనెత్తిన ప్రశ్నలు సరికొత్త చర్చకు దారి తీస్తున్నాయి.

ఆ పార్టీ జరిగిన రోజు బ్లడ్ శాంపిల్ తీసుకోకుండానే బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ ఇచ్చారట.. ప్రముఖ ల్యాబ్లలో సొంతంగా టెస్టులు చేశారట. అన్ని రిపోర్ట్స్ కూడా నెగిటివ్ వచ్చాయట. అలాంటప్పుడు తన కొడుకు మాదకద్రవ్యాలు తీసుకున్నట్టు ఎలా చెబుతారు అంటూ సుధాకర్ యాదవ్ ప్రశ్నిస్తున్నారు.. డిన్నర్ పార్టీకి ఆహ్వానం లభిస్తేనే తన కుమారుడు అక్కడికి వెళ్ళడని సుధాకర్ యాదవ్ అంటున్నారు. ఈలో గానే ఈగల్ టీం పోలీసులు వచ్చారని.. మహేష్ నుంచి మూత్రం.. రక్తం నమూనాలు తీసుకున్నారని.. ఆ తర్వాత పది నిమిషాలకే మహేష్ కు నెగిటివ్ రిపోర్టు వచ్చింద.. ఐదుగురికి మాత్రం పాజిటివ్ వచ్చిందని చెప్పడం అందరూ చూశారని సుధాకర్ యాదవ్ అంటున్నారు. అభిచరణ కొద్దిసేపటికే మహేష్ నుంచి మరోసారి యూరిన్ శాంపిల్ తీసుకున్నారని.. ఇది జరిగిన ఐదు గంటలకు మహేష్ కుమార్ కు పాజిటివ్ వచ్చిందని ఎస్పీ చెప్పడం ఆశ్చర్యంగా ఉందని సుధాకర్ యాదవ్ అంటున్నారు.

పుట్టా మహేష్ కు 2021లో హార్ట్ సర్జరీ జరిగింది. అప్పుడు ఆయనకు స్టంట్ వేశారు. ఆ సమయంలో కొన్ని వెజల్స్ వీక్ గా ఉన్నాయని డాక్టర్ చెప్పారు. పల్స్ 120 దాటకుండా చూసుకోవాలని డాక్టర్ చెప్పినట్టు సుధాకర్ యాదవ్ వివరించారు. ఇప్పటివరకు మహేష్ తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి పరీక్షలు చేయించుకుంటున్నారు. ఒక వ్యక్తి మాదక ద్రవ్యాలు తీసుకుంటే హార్ట్ పల్స్ 150 నుంచి 180 వరకు పెరిగిపోతుంది. అయితే ఆ పార్టీ జరిగిన రోజు పోలీసులు పరీక్షలు చేస్తే మహేష్ కు పల్స్ రేటు 97 మాత్రమే ఉంది.. ఇక మాదక ద్రవ్యాలు తీసుకుంటే ప్రాణాలకు ముప్పు అని మహేష్ కు తెలుసు.. అలాంటప్పుడు అతడు వాటిని ఎలా తీసుకుంటాడని సుధాకర్ యాదవ్ ప్రశ్నిస్తున్నారు.

ఇక పోలీసులు ఇచ్చిన రిమాండ్ రిపోర్టులో amphetamine, matha amphetmine అనే మందుల అవశేషాలు ఉన్నాయి.. గుండె జబ్బులు ఉన్నవారు.. షుగర్ ను నియంత్రించుకునేవారు ఆ మందులు వాడతారు. అందువల్లే ఆ రిపోర్టులో మాదక ద్రవ్యాలు తీసుకున్నట్టు రిపోర్టు వచ్చింది. ఇదే విషయాన్ని గతంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు తమ పరిశోధనలో చెప్పారు.. అంతేకాదు మహేష్ ఇంటికి వచ్చిన తర్వాత అనేక ల్యాబ్ లో యూరిన్.. రక్త పరీక్షలు చేయించుకున్నారు. ఆమె ఇంట్లో కూడా నేటివ్ రిపోర్టు వచ్చింది. ఢిల్లీలోని ప్రఖ్యాతమైన ఎయిమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్ లో బ్లడ్ టెస్ట్ చేస్తే కూడా నెగటివ్ రిపోర్ట్ వచ్చింది.. అలాంటప్పుడు తన కొడుకు మాదకద్రవ్యాలు తీసుకున్నట్టు ఎలా చెప్తారని సుధాకర్ అంటున్నారు. ఇంత లోతుగా సుధాకర్ యాదవ్ కీలక విషయాలను చెప్పిన నేపథ్యంలో.. టిడిపి అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...
Oktelugu Epaper
Exit mobile version