HomeతెలంగాణSouth Central Railway: కరీంనగర్‌ టూ హైదరాబాద్‌.. వయా మానేరు వంతెన.. !

South Central Railway: కరీంనగర్‌ టూ హైదరాబాద్‌.. వయా మానేరు వంతెన.. !

South Central Railway: సెంట్రల్‌ రైల్వే కీలక ప్రాజెక్టులు చేపడుతోంది. ఇందులో భాగంగా సౌత్‌ సెంట్రల్‌లో కీలకమైన హైదరాబాద్‌–కరీంనగర్‌ కనెక్టివిటీ పెంచడంపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా విజయవాడ వద్ద కృష్ణ నదిపై నిర్మించినట్లు మానేరు నదిపై బ్రడ్జి నిర్మించాలని భావిస్తోంది. ఇది పూర్తయితే కరీంనరగ నుంచి హైదరాబాద్‌కు రావడం చాలా ఈజీ అవుతుంది. కరీంనగర్, సిద్ధిపేట మీదుగా నేరుగా హైదరాబాద్‌ను అనుసంధానించనున్నారు. అందులో భాగంగా మనోహరాబాద్‌– కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టును ప్లాన్‌ చేశారు. దీనికి సంబంధించిన పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. వీటిలో భాగంగా సిరిసిల్ల సమీపంలో మానేరు నదిపై 2.4 కిలోమీటర్ల పొడవైన వంతెన నిర్మించనున్నారు. ఇందుకు రూ.332 కోట్లు ఖర్చవుతుందని రైల్వే శాఖ అంచనా వేసింది.

ఇనుప గడ్డర్లతో నిర్మాణం..
మానేరు నదిపై వంతెనను కృష్ణానదిపై నిర్మించిన వంతెన తరహాలో ఇనుప గడ్డర్లతో నిర్మించనున్నారు. ఈ పనులు త్వరలోనే ప్రారంభించనున్నారు. ప్రస్తుతం గోదావరి నదిపై పెద్దపెద్ద వంతెనలు ఉన్నాయి. ఇప్పుడు మానేరుపై నిర్మించే ఈ వంతెన వాటి సరసన నిలువనుంది.

సిరిసిల్లలో రైల్వే స్టేషన్‌..
ఇక హైదరాబాద్‌–కరీంనగర్‌ కనెక్టివిటీలో భాగంగా మనోహరాబాద్‌–కొత్తపల్లి ప్రాజెక్టును విస్తరిస్తున్నారు. ఇందులో భాగంగా సిద్దిపేట నుంచి హైదరాబాద్‌కు రైళ్లు తిరుగుతున్నాయి. సిద్దిపేట నుంచి సిరిసిల్ల మధ్య పనులు జరుగుతున్నాయి. సిరిసిల్లకు చేరుకోవాలంటే మానేరు నది దాటాలి. సిరిసిల్ల శివారులో రైల్వే స్టేషన్‌ కూడా నిర్మించనున్నారు. అక్కడికి చేరుకునే మర్గానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో మిడ్‌ మానేరు ఉంది.

భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా..
అన్ని పరిస్థితులు పరిశీలించిన అధికారులు గరిష్ట నీటిమట్టాన్ని పరిగణనలోకి తీసుకుని అంతకన్నా ఎక్కువ చేరినా రైలు మార్గానికి ఇబ్బంది లేకుండా వంతెన డిజైన్‌ చేశారు. నదీ తీరంలో ఉన్న గోపాలరావుపల్లి వద్ద వంతెన నిర్మాణం ప్రారంభమై సిరిసిల్ల వైపు అనుపురం గ్రామ పరిధిలో ల్యాండ్‌ అవుతుంది. ప్రయాణికులు రైళ్లు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లినా ఇబ్బంది కలుగకుండా వంతెన నిర్మిస్తారు.

టెండర్లు పిలిచిన రైల్వే..
రైల్వే వంతెన నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియను సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ప్రారంభించింది. ఈమేరకు వెంటర్లు పిలిచింది. గతంలో ఈ సెక్షన్‌ మధ్యలో భూ పరిహారం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం కాలంలో డిపాజిట్‌ చేయలేదు. దీంతో జాప్యం జరిగింది. ఇటీవల మొత్తం చెల్లించడంతో పనులు మొదలయ్యాయి. సిరిసిల్లవైపు లైన్‌ నిర్మాణం పూర్తయ్యేనాటికి వంతెన సిద్దం చేసేలా అధికారులు ప్లాన్‌ చేశారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version