Homeట్రెండింగ్ న్యూస్Mancherial Fire Incident: వివాహేతర సంబంధం కొంప ముంచింది. మంచిర్యాల ఆరుగురు సజీవదహనం కేసులో షాకింగ్‌...

Mancherial Fire Incident: వివాహేతర సంబంధం కొంప ముంచింది. మంచిర్యాల ఆరుగురు సజీవదహనం కేసులో షాకింగ్‌ నిజాలు.. !!

Mancherial Fire Incident: జీవితాంతం తోడుంటానని.. కష్టసుఖాల్లోనూ కలిసే ఉంటామని ప్రమాణం చేసి వివాహబంధంతో ఒక్కటవుతున్న జంటలు.. సాఫీగా సాగాల్సిన సంసారాల్లో వివాహేదర బంధాలు విచ్ఛిన్నం చేస్తున్నాయి. జీవిత భాగస్వామి చావును కోరుకుంటున్నాయి. తమ కాపురాల్లో చేజేతులా నిప్పులు పోసుకుంటున్నారు. ప్రియుడి మోజులోపడి జీవిత భాగస్వామిని అంతమొందిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో ఆరుగురు సజీవదహనం కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జిల్లాలోని మందమర్రి మండలం గుడిపెల్లి గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. గ్రామంలోని మాసు శివయ్య అనే వ్యక్తి ఇంటిలో మంటలు చెలరేగి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా.. మొత్తం ఆరుగురు సజీవదహనం అయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇక విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెల్లడవుతున్నాయి. వివాహేతర సంబంధం, ఆస్తి పంపకాలు, వారసత్వ ఉద్యోగం వంటి తగాదాల కారణంగా ఈ దారుణం చోటు చేసుకుందని పోలీసులు వెల్లడించారు.

Mancherial Fire Incident
Mancherial Fire Incident

 భర్త మరో మహిళతో..
గ్రామంలో నివాసం ఉంటున్న శనిగారాపు శాంతయ్య(40) సింగరేణిలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఇక అతడికి భార్య సృజన, ఇద్దరు కుమారులు రాజ్‌కుమార్, దీపక్‌ ఉన్నారు. అయితే శాంతయ్య వారసత్వ ఉద్యోగం కోసం కుమారులు ఆరేళ్లుగా.. తండ్రితో గొడవపడుతున్నారు. ఇదిలా ఉండగానే.. శాంతయ్య తనకున్న రెండున్నర ఎకరాల స్థలాన్ని అమ్మకానికి పెట్టాడు. 30 లక్షల రూపాయలు అడ్వా¯Œ ్సగా తీసుకున్నాడు. ఆ డబ్బు గురించి కూడా భార్యాకుమారులు తరచుగా శాంతయ్యతో గొడవపడేవారు. పైగా శాంతయ్యకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం కాస్త ఆయన భార్య సృజనకు తెలిసింది.

భార్య మరో వ్యక్తితో..
భర్త తీరు గురించి ప్రశ్నించి.. మందలించి.. మార్చుకోవాల్సిన సృజన కాస్త.. నేనేందుకు తగ్గాలి అనుకుని.. మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండసాగింది. కొన్ని రోజుల క్రితం భర్తను వదిలేసింది. ఈ క్రమంలో వారసత్వ ఉద్యోగం పొందాలన్న.. భూమి అమ్మిన డబ్బులు తమ చేతికి చిక్కాలన్నా.. శాంతయ్యను అంతమొందించడమే మార్గంగా భావించింది సృజన. ఈ క్రమంలో తన ప్రియుడితో కలిసి.. శాంతయ్యను హత్య చేసేందుకు ప్లా¯Œ చేసింది. అందుకోసం ఏకంగా రూ.2 లక్షల సుపారీ కూడా ఇచ్చినట్లు దర్యాప్తులో వెల్లడయ్యిందని పోలీసులు తెలిపారు.

Mancherial Fire Incident
Mancherial Fire Incident

నెల క్రితం హత్యాయత్నం..
నెల రోజుల క్రితమే శాంతయ్యపై హత్యాయత్నం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. కానీ ఆరోజు అతడి అదృష్టం బాగుండి తప్పించుకున్నాడు. ఈసారి అలా మిస్సవ్వకూడదని భావించి.. ఏకంగా సజీవదహనానికి ప్లా¯Œ చేశారు. శాంతయ్యను అంతమొందిచే క్రమంలో మరో ఐదుగురు అమాయకులను బలి తీసుకున్నారు. ముందుగా ఆహారంలో మత్తు మందు కలిపి.. వారు గాఢ నిద్రలోకి జారుకున్న తర్వాత.. పెట్రోల్‌ పోసి.. నిప్పంటించినట్లు.. పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో కేసులో అనుమానితులుగా ఉన్న శాంతయ్య భార్య సృజనతోపాటు.. మరో ముగ్గురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తప్పుడు మార్గంలో వెళ్తున్న భర్తను మందలించి మార్చుకోవాల్సింది పోయి.. తాను కూడా అదే మార్గంలో వెళ్లడమే కాక.. ఏకంగా భర్తను చంపేసింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version