Saddula Bathukamma Wishes : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటారు. పూలనే దేవుడిగా తయారు చేసి పూజించే ఇంతటి గొప్ప పండుగను ఆడపడుచులు అందరూ సంతోషంగా జరుపుకుంటారు. పువ్వులను గౌరమ్మగా తయారు చేసి తొమ్మిది రోజుల పాటు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. భాద్రపద అమావాస్య నాడు ప్రారంభమైన బతుకమ్మను మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో పూజిస్తారు. ఇలా తొమ్మిది రోజులు ఒక్కో పేరుతో పూజిస్తారు. చివరిగా తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ పేరుతో పూజిస్తారు. ఆ రోజు ఎక్కడ చూసిన కూడా బతుకమ్మ సంబరాలే కనిపిస్తాయి. సద్దుల బతుకమ్మ రోజు గౌరమ్మకి ప్రత్యేకమైన నైవేద్యాలు చేసి పెడతారు. అందమైన పూలతో తయారు చేసిన సద్దుల బతుకమ్మను సాయంత్రం గంగమ్మ ఒడిలో వదిలిపెడతారు. గౌరమ్మను వదిలిపెట్టే ముందు ప్రతి ఒక్కరూ గుంపులుగా ఆడపడుచులు కలిసి ఆటపాటలతో సందడి చేస్తారు. సంతోషంగా బతుకమ్మను గంగమ్మ ఒడికి చేర్చుతారు. బతుకమ్మ రోజు ప్రతి ఇంట్లో ఆడపడుచులు గౌరమ్మలా కనిపిస్తారు. బతుకమ్మ పండుగ చివరి రోజు మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, మీకు ఇష్టమైన వారికి కొత్తగా శుభాకాంక్షలు చెప్పండి. మరి మీకు ఎలా చెప్పాలో తెలియడం లేదా అయితే ఈ స్టోరీ మొత్తం చదివేయండి.
తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి.. ఆటపాటలు, కోలాటాలతో ఆడపడుచులు ఆనందంగా జరుపుకునే ఆడబిడ్డలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు..
తెలంగాణ ఆడబిడ్డలు అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు..
తెలంగాణ ఆచార, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక.. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని జరుపుకోవాలని.. సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
పువ్వులను గౌరమ్మగా చేసి పూజించే ఆడపడుచులు.. మీ ఇంటికి మహారాణులు.. బతుకమ్మ శుభాకాంక్షలు
బతుకమ్మలోని పువ్వులు అంత అందంగా.. మా ఇంటి మహాలక్ష్మిలు నవ్వుతూ ఉండాలని కోరుకుంటూ.. బతుకమ్మ శుభాకాంక్షలు
పుట్టి.. తెలంగాణలోని పూల పల్లకిలో లోకమంతా తిరిగి బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని.. మీకు , మీ కుటుంబ సభ్యులకు బతుకమ్మ శుభాకాంక్షలు..
పూలను పూజించే.. ప్రకృతిని ఆరాధించే ఆడబిడ్డలు అందరూ జరుపుకునే పండుగ మన బతుకమ్మ వేడుక. సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు..
తెలంగాణ సంప్రదాయాలు, ఆచారాలను చాటి చెప్పే పండుగ బతుకమ్మ.. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు
పూలను పూజించడం గొప్ప సంప్రదాయం.. అంతటి గొప్ప పండుగ బతుకమ్మ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు బతుకమ్మ శుభాకాంక్షలు.
పూలతో పూజించే భగవంతుని.. పూలనే పూజించే గొప్ప సంస్కృతి మన సొంతం.. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తంగేడు పువ్వుల నవ్వులు ఆడపడుచుల ముఖంలో ఉండాలని కోరుకుంటూ ..
సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..
బంగారు బతుకమ్మ ఉయ్యాలో..
తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ ఉయ్యాలో.. తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ.
గౌరమ్మ..
తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ.. తంగేడు కాయెప్పునే గౌరమ్మ..
అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు