Digvesh Rathi 5 Wickets: ఆ బౌలర్ పేరు దిగ్వేష్ రాటి.. లక్నో జట్టు తరఫున ఆడిన అతడు.. ఐపీఎల్ లో సంచలన సృష్టించాడు. ముఖ్యంగా అతడి బౌలింగ్ ప్రదర్శన కంటే నోట్ బుక్ సెలబ్రేషన్ తో ఎక్కువగా మీడియాలో, సోషల్ మీడియాలో నానాడు. తన అతి ప్రవర్తన వల్ల దానికి తగ్గట్టుగానే ఫలితం అనుభవించాడు. మైదానంలో అతి ప్రవర్తన వల్ల ఈసారి ఐపిఎల్ లో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఏకంగా రెండుసార్లు అతనికి అపరాధ రుసుం విధించింది. ఒక మ్యాచ్లో ఆడకుండా కట్టడి చేసింది. మొత్తంగా దిగ్వేష్ ఈ సీజన్లో 13 మ్యాచులు ఆడాడు. 14 వికెట్లు సొంతం చేసుకున్నాడు. అద్భుతమైన ప్రతిభ ఉన్నప్పటికీ.. విభిన్నమైన నైపుణ్యం ఉన్నప్పటికీ అతడు అతి ప్రవర్తన వల్ల విమర్శల పాలయ్యాడు.
Also Read: ఆ విషయం చెప్పానని.. విరాట్ కోహ్లీ పగ పెంచుకున్నాడు: డివిలియర్స్
దిగ్వేష్ ఎంప్రెస్ క్రికెట్ లీగ్ లో అదరగొట్టాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగింది. ఫిబ్రవరి 21న ఏబీ రైసింగ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో దిగ్విష్ సహగల్ క్రికెట్ క్లబ్ తరఫున అదిరిపోయే ప్రదర్శన చేశాడు.. ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీసి అదరగొట్టాడు. తనకు మాత్రమే సాధ్యమైన స్పిన్ బౌలింగ్ వేసి సత్తా చూపించాడు. ఈ వీడియోను లక్నో జట్టు యాజమాన్యం ట్విట్టర్లో పంచుకుంది. లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయంక కూడా ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది..నోట్ బుక్ సెలబ్రేషన్ ద్వారా వెలుగులోకి వచ్చిన దిగ్వేష్.. ఆకట్టుకునే స్థాయిలో ప్రదర్శన చేసినప్పటికీ.. అతి ప్రవర్తన వల్ల విమర్శల పాలయ్యాడు. అయితే అతడు సీజన్లో జట్టులో స్థానం కోల్పోతాడని అందరూ అనుకున్నారు. ఇప్పుడు సంజయ్ స్వయంగా వీడియో విడుదల చేయడం.. ట్విట్టర్లో ప్రముఖంగా పేర్కొనడంతో.. అతడి స్థానానికి వచ్చే సీజన్లో డోకా లేదని తెలుస్తోంది. అతడిని జట్టులో కొనసాగిస్తారని.. ఇందులో ఏమాత్రం అనుమానం చెందాల్సిన అవసరం లేదని ప్రచారం జరుగుతోంది.. లక్నో జట్టు ఈ సీజన్లో అంచనాలకు తగ్గట్టుగా ఆడలేకపోయినప్పటికీ.. చివరి మ్యాచ్ లలో మాత్రం అదరగొట్టింది. కెప్టెన్ పంత్ సీజన్ ప్రారంభంలో సరిగ్గా ఆడ లేకపోయినప్పటికీ.. చివర్లో మాత్రం ఫామ్ లోకి వచ్చాడు.
దిగ్వేష ఐదు వికెట్లు సాధించడంతో సోషల్ మీడియాలో అతనిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇంత టాలెంట్ గా ఉన్న ఆటగాడు.. అతి ప్రవర్తన వల్ల విమర్శల పాలవుతున్నాడని నెటిజన్లు పేర్కొంటున్నారు. అతి ప్రవర్తన తగ్గించుకుంటే ఉజ్వలమైన ఆటగాడిగా కొనసాగుతాడని.. సమర్థవంతమైన బౌలర్ గా ఆవిర్భవిస్తాడని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అతడు తన తీరు మార్చుకోవాలని.. తన ప్రతిభకు మరింత సాన పెట్టుకోవాలని క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు.
Stumbled upon this clip of Digvesh Rathi taking 5 in 5 in a local T20 game. Just a glimpse of the talent that made him a breakout star for @LucknowIPL in IPL 2025. pic.twitter.com/i8739cjxpk
— Dr. Sanjiv Goenka (@DrSanjivGoenka) June 16, 2025