Riyaz Incident in Nizamabad: నిజామాబాద్ జిల్లాలో రియాజ్ ఉదంతం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కానిస్టేబుల్ ప్రమోద్ ను రియాజ్ అత్యంత దారుణంగా హత మార్చాడు. కేసు విచారణ నేపథ్యంలో ప్రమోద్ రియాజ్ ను బైక్ మీద తీసుకెళ్తుండగా.. అతడు అడ్డగించాడు. తన వెంట తెచ్చుకున్న పదునైన ఆయుధంతో ప్రమోద్ ను తీవ్రంగా గాయపరిచాడు. ఈ ప్రమాదంలో ప్రమోద్ శరీరం నుంచి తీవ్రంగా రక్తస్రావం జరిగింది. ఆ తర్వాత ప్రమోద్ ను ఆసుపత్రికి తరలించగా.. అక్కడ అతడు చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ప్రమోద్ ను గాయపరిచిన రియాజ్ పరారయ్యాడు. ఆ తర్వాత అతడిని ఒక్క రోజు వ్యవధిలో పోలీసులు. ఆ తర్వాత అతడు అత్యంత నాటకీరయ పరిణామాల మధ్య నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎ*న్*కౌం*ట*ర్ అయ్యాడు. ఈ నేపథ్యంలో రియాజ్ ఉదంతానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.
రియాజ్ కన్నుమూసిన తర్వాత కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్య కీలక విషయాలను వెల్లడించారు. పోలీసులపై కాల్పులు జరుపుతుండగా ఆత్మ రక్షణ కోసం పోలీసులు తుపాకులకు పని చెప్పారని.. ఈ ఘటనలో రియాజ్ కన్నుమూశాడని వెల్లడించారు. రియాజ్ దాడి చేసినప్పుడు ఆసిఫ్ అనే వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయని.. అతడిని హైదరాబాదులోని మల్లారెడ్డి ఆసుపత్రిలో చేర్పించామని.. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడని సిపి వెల్లడించారు. ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు. రియాజ్ పోస్టుమార్టం తర్వాత మరిన్ని విషయాలు చెబుతామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన అనేక ప్రశ్నలకు సిపి సమాధానం వెళ్లిపోయారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో తాను ఇంతకంటే ఎక్కువ విషయాలు చెప్పకూడదని సిపి పేర్కొన్నారు.
మృతదేహానికి పోస్టుమార్టం తర్వాత రియాజ్ కు అత్యంత గోప్యంగా అంత్యక్రియలు జరిపించారు.. తెల్లవారుజామున 3 గంటలకు మెజిస్ట్రేట్ సమక్షంలో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ఆ తర్వాత రియాజ్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం బోధన్ రోడ్డులోని స్మశాన వాటికలో అంత్యక్రియలు జరిపారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులు మినహా మిగతావారు రాకుండా అక్కడ పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. రియాజ్ కన్నుమూసిన తర్వాత.. అతడి ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అంతేకాదు బయట వ్యక్తులు రాకుండా ఉండేలా అక్కడ నిషేధాజ్ఞలు అమలు చేశారు.
ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించారు. జరిగిన సంఘటనపై ఆయన సంతాపం వ్యక్తం చేశారు. ప్రమోద్ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ప్రకటించారు. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇస్తామని పేర్కొన్నారు. 300 గజాల ఇంటి స్థలం కూడా ఇస్తామని వెల్లడించారు. పోలీసు భద్రత సంక్షేమం నుంచి 16 లక్షలు.. పోలీస్ వెల్ఫేర్ నుంచి 8 లక్షలు ఇస్తామని పేర్కొన్నారు. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ పై దాడి జరగడం దురదృష్టకరమైన సంఘటనగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అయితే దీనిని శాంతిభద్రతల లోపంగా ప్రతిపక్షాలు విమర్శించడాన్ని తప్పు పట్టారు. అంతేకాదు ఇలాంటి వ్యవహారాలలో కూడా రాజకీయాలు చేయడం ప్రతిపక్ష పార్టీకి అలవాటుగా మారిందని ముఖ్యమంత్రి విమర్శించారు. ఘటన జరిగిన మరుసటి రోజే నిందితుడిని పోలీసులు పట్టుకోవడం పట్ల ఆయన అభినందించారు. నిందితుడు పోలీసుల మీద దాడికి దిగేందుకు ఇప్పించడం వల్లే ప్రతి కాల్పులు జరపవలసి వచ్చిందని ముఖ్యమంత్రి వివరించారు.