Revanth Reddy Vs KCR: జల్సా సినిమాలో డైలాగ్ ఉంటుంది గుర్తుందా.. శత్రువును ఓడించడం అంటే చంపడం కాదు.. గెలవడం.. చాలామందికి ఇది అర్థం కాదు గాని.. దీనిని అర్థమయ్యేలా నిరూపించి చూపిస్తున్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్. ” కెసిఆర్ ను చర్లపల్లి జైలుకు పంపించడం ఎందుకు.. ఆయనకు ఫామ్ హౌస్ లో ఉండడమే పెద్ద శిక్ష. నన్ను ఓ చిన్న స్థాయి లీడర్ అని అనుకున్నాడు. తొక్కి తొక్కి అధపాతాళానికి పంపించానని అనుకున్నాడు. చివరికి నా చేతిలోనే ఆయన ఓడిపోయాడు. ఇంతకు మించిన శిక్ష ఇంకేం ఉంటుందని” రేవంత్ ఇటీవల వ్యాఖ్యానించడం విశేషం. తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటల ద్వారా కేసిఆర్ ను జైలుకు పంపించే ఉద్దేశం లేదని తెలుస్తోంది. అలాంటి ఉద్దేశం లేని పక్షంలో కమీషన్లను ఎందుకు ఏర్పాటు చేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
గొర్రెల పథకం, కాలేశ్వరం, గత ప్రభుత్వం చేపట్టిన వివిధ పనులపై రేవంత్ కమీషన్లను ఏర్పాటు చేశారు. విచారణ అధికారులు ఇప్పటికే కాలేశ్వరం, గొర్రెల కుంభకోణం లో తుది నివేదికలు ఇచ్చారు. ఇందులో అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రి ఓ ఎస్ డి గా పనిచేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాలేశ్వరం కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన మురళీధర్, హరి రామ్ నాయక్ ఏసీబీ అదుపులో ఉన్నారు.. ఇంకా ఈ కేసులో మరిన్ని తీవ్రమైన పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని సాక్షాత్తు గులాబీ అధిపతి అన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంత మందిని అరెస్టు చేస్తున్నప్పటికీ కెసిఆర్ జోలికి తెలంగాణ ముఖ్యమంత్రి వెళ్లకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. “ప్రత్యర్థి కుంగి కృశించి.. నన్ను వదిలేయ్.. ఈ ఓటమిని నేను తట్టుకోలేను. ఈ జాలిని నేను భరించలేను.. అనేతీరుగా కెసిఆర్ విషయంలో రేవంత్ వ్యవహరిస్తున్నారని” రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Read Also: మోడీ దేశం కోసం నిలబడ్డాడా.. రాజీపడ్డాడా?
రేవంత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. అంతకుముందు టిడిపి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కెసిఆర్ టార్గెట్ చేసి వేధించారు. ఇబ్బంది పెట్టారు. పర్యాయాలు జైలుకు కూడా తరలించారు. చివరికి ఆయన కూతురు వివాహం ఉన్నప్పటికీ కేసీఆర్ వదిలిపెట్టలేదు. తనను అంతటి ఇబ్బందులకు గురిచేసిన సమయంలో రేవంత్ అనేక పర్యాయాలు కేసిఆర్ ను జైలుకు పంపిస్తానని హెచ్చరికలు జారీ చేశారు. గజ్వేల్ లో కూడా తొడగొట్టి ఇదే తీరుగా సవాల్ కూడా విసిరారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ వ్యవహార శైలి ఒక్కసారిగా మారిపోయింది. కెసిఆర్ విషయంలో రేవంత్ జాలి ప్రదర్శిస్తున్నారు. ఉదారతను చూపిస్తున్నారు. అదుపులోకి తీసుకునే అవకాశం వచ్చినప్పటికీ.. ఆ దిశగా అడుగులు వేయడం లేదు.
Read Also: రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ తో సంజు శాంసన్ ఎక్కడ చెడింది?
రేవంత్ చేస్తున్న పని జాలి కాదని.. మానసికహింస అని తెలుస్తోంది. వాస్తవానికి కెసిఆర్ 2023 ఎన్నికల ఫలితాలను జీర్ణించుకోలేకపోయారు. తన రాజీనామా లేఖను గవర్నర్ కు ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు. రేవంత్ ముఖ్యమంత్రి కావడాన్ని కెసిఆర్ అసలు జీర్ణించుకోలేకపోయారు. అయినప్పటికీ రేవంత్ కెసిఆర్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆయన క్షేమం కోరి పరామర్శించారు.. ప్రభుత్వపరంగా ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షించారు. రేవంత్ చేతిలో అధికారం ఉన్నప్పటికీ ప్రత్యర్థుల విషయంలో ఏమాత్రం దూకుడు కొనసాగించడం లేదు. ప్రతీకారం తీర్చుకోవడం లేదు.. కాకపోతే ప్రత్యర్థులను ఎలా హింసించాలో అలానే హింసిస్తున్నారు. అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా అరెస్టు చేయడం లేదు. ఎందుకంటే అలా అరెస్టులు చేస్తే ప్రజల్లో సానుభూతి పెరుగుతుంది. అందువల్లే ప్రత్యర్థులపై మానసికంగా పగ తీర్చుకుంటున్నారు రేవంత్. రాజకీయాలలో సరికొత్త స్టైల్ అవలంబిస్తున్నారు.