Revanth Reddy : ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చింది.. సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చింది. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ విషయాలను ప్రస్తావించింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో తాత్సారం ప్రదర్శిస్తోంది. ఇదే విషయంపై ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె నిర్వహించడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని సంకేతాలు పంపింది. త్వరలో ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. మిగతా ప్రభుత్వ విభాగాల ఉద్యోగులు కూడా తమ సమస్యలపై స్పందించాలని కోరుతున్న నేపథ్యంలో.. నేరుగా ఈ విషయాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే మాట్లాడారు.
Also Read : రాజీవ్ యువ వికాసం.. కావాలంటే ఇది కావాల్సిందే?
నన్ను కోసుకుని..
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి సంచలన విషయాలను వెల్లడించారు..” రాష్ట్రంలో ఆదాయం పెరిగే పరిస్థితి లేదు. తనకు 18,500 కోట్లకు మించి ఆదాయం రావడం లేదు. వచ్చిన ఆదాయం జీతాలు, పింఛన్లు, పెన్షన్లు, చేసిన అప్పులకు వడ్డీలు, ఇతర పథకాలకు మాత్రమే సరిపోతోంది. కొత్తగా ధరలు పెంచే అవకాశం కూడా ఎందులో లేదు. ఎందులో ధరలు పెంచాలో కూడా అర్థం కావడం లేదు. ఇలా ధరలు పెంచితే ప్రజల పరిస్థితి ఏమవుతుందో కూడా చెప్పడానికి వీలు కావడం లేదు. ఇలాంటి సందర్భంలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటే సాధ్యం కావడం. పోనీ ఉద్యోగ సంఘాల నాయకులు ఏదైనా ప్రభుత్వ పథకానికి చెల్లింపులు ఆపివేసి.. తమకు బోనస్, జీతాలు పెంచమంటే ఆ పని చేస్తా. ఒక బహిరంగ సభ పెట్టి.. 10 లక్షల మంది జనాన్ని సమీకరించి.. ఉద్యోగ సంఘాల నాయకులతోనే ఆ మీటింగ్ నిర్వహిస్తా. ఒక చీటీ రాసి.. అందులో ఉన్న వివరాల ప్రకారమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలిస్తున్నారని చెబితే.. దానికి నేను ఓకే అంట. ఎందుకంటే ఉద్యోగ సంఘాల నాయకులు నన్ను కోసుకొని తిన్నా రూపాయి నా దగ్గర లేదు. ఉద్యోగ సంఘాల నాయకులు నన్ను ఏం చేయగలుగుతారు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ఇలాంటప్పుడు ఉద్యోగ సంఘాల నాయకుల సమస్యలు పరిష్కరించడం.. వారికి జీతాలు పెంచడం.. బోనస్ లు చెల్లించడం సాధ్యమయ్యే పని కాదని” రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.. ఇక రేవంత్ రెడ్డి ఇటీవల ఇదే తరహా వ్యాఖ్యలు చేయడం.. ఇప్పుడు కూడా ఇలాగే మాట్లాడటంతో ఉద్యోగ వర్గాల్లో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ” ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని భావించాం. కానీ అలాంటిది రాలేదు. ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదు.. ఎన్నికల ముందు మా సమస్యలు పరిష్కరిస్తామని అనేక హామీలు ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని పూర్తిగా విస్మరించారు. ఇలా అంటే మా సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయని” ఉద్యోగ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read : రేషన్ అమ్ముకుంటున్నారా? ఇక మీకు రేషన్ కార్డ్ కట్!