Manchu Manoj Review Kannappa: మంచు విష్ణు(Manchu Vishnu) నటించిన లేటెస్ట్ చిత్రం ‘కన్నప్ప'(Kannappa Movie) నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ హాఫ్ కాస్త సహనం తో భరించాలి కానీ, సెకండ్ హాఫ్ లో మాత్రం ప్రభాస్ ఎంట్రీ నుండి సినిమా మరో లెవెల్ కి వెళ్లిందని చూసిన ప్రతీ ఒక్కరు అంటున్నారు. ముఖ్యంగా మంచు విష్ణు నటనపై కూడా ప్రశంసలు కురుస్తున్నాయి. చివరి 15 నిమిషాల్లో ఆయన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే మొదటి నుండి ఈ చిత్రం పై సెటైర్లు వేస్తూ కనిపించిన మంచు విష్ణు సోదరుడు మంచు మనోజ్(Manchu Manoj), నేడు ఈ సినిమాని హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టీప్లెక్స్(Prasad Multiplex) లో చూసాడు. చూసిన తర్వాత కచ్చితంగా తనదైన స్టైల్ లో ట్రోల్ చేస్తాడని అందరూ అనుకున్నారు.
Also Read: Mysaa Movie First Look: ‘మైసా’ గా రష్మిక మందన..భయపెడుతున్న లుక్స్..స్టోరీ ఏమిటంటే!
కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఆయన ఈ చిత్రం పై పాజిటివ్ కామెంట్స్ చేసాడు. ఆయన మాట్లాడుతూ ‘కన్నప్ప చిత్రాన్ని ఇప్పుడే చూసి వస్తున్నాను. చాలా చాలా బాగుంది. లీడ్ నటీనటులు చాలా అద్భుతంగా నటించారు. ప్రభాస్ అన్న ఎంట్రీ తర్వాత సినిమా వేరే లెవెల్ కి వెళ్ళింది. కొంతమంది నటీనటులను ఐమాక్స్ స్క్రీన్ మీద చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి. నేను కలలో కూడా ఊహించని విధంగా ఈ చిత్రం లో వాళ్ళు అద్భుతంగా నటించారు. నేను అనుకున్న దానికంటే ఈ చిత్రం వెయ్యి రెట్లు బాగుంది. మూవీ టీం మొత్తానికి కంగ్రాట్స్. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ మంచు మనోజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. గత కొంత కాలంగా మంచు మనోజ్ కి మంచు విష్ణు కి మధ్య ఎలాంటి గొడవలు జరుగుతున్నాయో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం.
అలాంటి మనోజ్ ఇప్పుడు తన అన్నయ్య సినిమా గురించి ఇంత మంచి పాజిటివ్ టాక్ చెప్పడం నిజంగా కన్నప్ప కి చాలా ఉపయోగపడుతుంది అనుకోవచ్చు. మిగిలిన రివ్యూయర్స్ రేటింగ్స్ ఎంత వరకు రీచ్ అవుతాయో తెలియదు కానీ,మంచు మనోజ్ రివ్యూ మాత్రం సోషల్ మీడియా లో వైల్డ్ ఫైర్ లాగా వ్యాప్తి చెందుతుంది. అయితే ఇప్పుడు కూడా ఆయన మంచు విష్ణు పేరు ని ఎక్కడా ప్రస్తావించకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిన్న కూడా ఇంత ట్విట్టర్ లో ఈ చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికి ఆల్ టైం బెస్ట్ చెప్తూ మంచు విష్ణు పేరు ని ప్రస్తావించలేదు. చూస్తుంటే తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అన్న తీరులో మంచు మనోజ్ తీరు ఉంది . అన్నయ్య మీద పీకల దాకా కోపం ఉన్నప్పటికీ సినిమా బాగుంటే మనస్ఫూర్తిగా బాగుంది అని చెప్పడం మనోజ్ కే చెల్లింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
కన్నప్ప సినిమా చాలా చాలా బాగుంది : మంచు మనోజ్
ప్రభాస్ వచ్చిన తర్వాత సినిమా నెక్స్ట్ లెవల్ కి వెళ్తుంది.
క్లైమాక్స్ లో ఇంత గొప్ప పెర్ఫార్మెన్స్ చేస్తారని కలలో కూడా అనుకోలేదు.
సినిమాలో అందరూ చాలా బాగా చేశారు.నేను అనుకున్న దాని కంటే సినిమా వెయ్యి రెట్లు బాగుంది.
– మంచు మనోజ్ pic.twitter.com/7M9Yo4rq8i— ChotaNews App (@ChotaNewsApp) June 27, 2025