Revanth Is Taking Everything In His Hands: పదేళ్ల తరువాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ప్రతిదాంట్లోనూ కాంగ్రెస్‌కు అడ్డుపడుతూనే ఉంది. ఏ పథకం, ఏ అభివృద్ధి పని చేపట్టాలనుకుంటున్నా దానికి కాంగ్రెస్ వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెడుతోంది. ఒకవిధంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిలా తయారైంది. అటు బీజేపీ కూడా ఏమాత్రం తగ్గకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై అటాక్ చేస్తూనే ఉంది. గ్రూప్ 1, మూసీ తదితర వివాదాలపై ఇరు పార్టీలు కూడా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. ఇలా ఎవరికి వారుగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీపై అటాక్ చేస్తూనే ఉన్నాయి.
అయితే.. రేవంత్‌కు ప్రతిపక్ష పార్టీల నుంచి ఈ విధమైన తలపోటు ఉంటే.. కొందరు సొంత పార్టీ నేతల వైఖరి కూడా ఇబ్బంది పెడుతోంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న లాంటి వాళ్లు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆయన అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అయినప్పటికీ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. దాంతో ఆయనను ఆదర్శంగా తీసుకొని చాలా మంది నేతలు తమ వాయిస్ వినిపిస్తున్నారు. ప్రభుత్వంపై నిరసనగళం వినిపిస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యతిరేక వాయిస్‌లకు బ్రేక్ వేయాలని నిర్ణయించుకున్నారు. లేదంటే భవిష్యత్తులో పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందులు రావచ్చన్న ఉద్దేశంతో ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకోవడమే కాకుండా వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ఇటీవల కులగణనపై గాంధీభవన్‌లో సమావేశం నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీలైన్ తప్పితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే సహించేది లేదని అన్నారు. పార్టీ మాట అంటే మాటేనని.. దానిని కాదని వేరే మాట్లాడితే పార్టీ ద్రోహులేనని అన్నట్లుగా చెప్పారు. తనకంటూ ప్రత్యేక ఎజెండా ఏమీ లేదని, పార్టీ ఎజెండానే తన ఎజెండా అని స్పష్టం చేశారు.
ప్రాంతీయ పార్టీల్లో అధినేత తీసుకున్న నిర్ణయానికి పెద్దగా ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడరు. మాట్లాడలేరు కూడా. కానీ.. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించడంపై సీఎం ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వచ్చినట్లుగా వారు స్టేట్మెంట్లు ఇవ్వడం అలవాటు. అంతేకాకుండా గ్రూపుల కుమ్ములాటలూ సరేసరి. ముఖ్యంగా ఇప్పుడు కొత్త, పాత అన్న వివాదం నడుస్తూనే ఉంది. దీనికితోడు ఇటీవల రాష్ట్రంలో పలు కీలక ఘటనలూ జరిగాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అనుచరుడు జగిత్యాలలో మర్డర్ అయ్యాడు. దాంతో ఆయన కూడా ఫిరాయింపుదారులపై కీలక కామెంట్స్ చేశారు. ఇటు మరో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా మొదటి నుంచి పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకే రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారన్నది స్పష్టం అవుతోంది.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read MoreWeb Title: Revanth is taking everything in his hands he is serious about those congress leaders
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com