CM Revanth Reddy: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. ప్రజలకు మాత్రమే కాదు.. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అనేక వరాలు ప్రకటించింది. అధికారంలోకి వచ్చి ఈ ఏడాది దాటిపోయినప్పటికీ హామీల గురించి ప్రభుత్వం పెద్దగా దృష్టి సారించినట్టు కనిపించలేదు. ప్రతినెల ఒకటో తారీకు ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నప్పటికీ… మిగతా వాటి విషయంలో మాత్రం ప్రభుత్వం ఆ తరహాలో ఉదారత చూపించలేదు.
Also Read: మహిళా దినోత్సవం : జగన్ ఇప్పుడు టార్గెట్ అయ్యాడుగా..!
ప్రతినెల ఉద్యోగ విరమణ చేస్తున్న ఉద్యోగులకు.. అంతకుముందు ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు ప్రభుత్వపరంగా రావాల్సిన బెనిఫిట్స్ పెండింగ్లో ఉన్నాయి. దాదాపు ఇవి ఎనిమిది వేల కోట్ల వరకు ఉంటాయని తెలుస్తోంది. తమకు రావాల్సిన బెనిఫిట్స్ కోసం విశ్రాంత ఉద్యోగులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇక ఉద్యోగులు తమకు రావాల్సిన బిల్లుల మంజూరు చేయాలని సంబంధిత ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రెజరీ ల మీద ప్రభుత్వం అనధికారిక ఆంక్షలు విధించడంతో బిల్లులు మంజూరు చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు.. విశ్రాంత ఉద్యోగులు ప్రభుత్వంపై నిరసన స్వరం వినిపించడం మొదలుపెట్టారు. విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని భారత రాష్ట్ర సమితి.. భారతీయ జనతా పార్టీ ప్రముఖంగా ప్రస్తావిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. దీంతో కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఏం చెప్పారంటే..
పెండింగ్ బిల్లులు.. బకాయిల గురించి రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కను కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను ఉద్యోగుల జేఏసీ ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ముందు ఏకరవు పెట్టింది. ఈ సందర్భంగా వాళ్ల సమస్యలను భట్టి సావధానంగా విన్నారు. ” పెండింగ్ బిల్లులు అలాగే ఉన్నాయి. పదవి విరమణ చేసిన ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. మిగతా బిల్లులు కోసం ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఉదారత చూపించాలి. బిల్లులు మంజూరు కాకపోవడంతో ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని” ఉద్యోగుల జేఏసీ నాయకులు భట్టి విక్రమార్క ఎదుట వాపోయారు. వారు చెప్పిన విషయాలను విన్న భట్టి విక్రమార్క.. గుడ్ న్యూస్ చెప్పారు. ” మాది స్నేహపూర్వక ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు మాకు తెలుసు. ఎన్నికల ముందు మేము ఇచ్చిన హామీలు గుర్తుకే ఉన్నాయి. వాటిని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉంది. ఆయనప్పటికీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో రాజీపడేది లేదు. వచ్చే ఏప్రిల్ నుంచి ప్రతినెల 500 నుంచి 600 కోట్ల చొప్పున ఉద్యోగులకు సంబంధించిన 8,000 కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లిస్తాం. ఇకపై కొత్త బకాయిలు లేకుండా చూస్తాం. ఉద్యోగులు బకాయిల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఆర్థికేతర విషయాలను సబ్ కమిటీలో చర్చించి పరిష్కరిస్తాం. ఉద్యోగుల సంబంధించిన ఇతర సమస్యలను కూడా పరిష్కరిస్తాం. ఉద్యోగుల నియామక ప్రక్రియలలో ఎటువంటి ఆలస్యం లేకుండా చూస్తాం. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలను భర్తీ చేస్తామని” భట్టి విక్రమార్క పేర్కొన్నారు. దీంతో ఉద్యోగుల జేఏసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కొంతకాలంగా ప్రభుత్వంపై ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్న నేపథ్యంలో.. భట్టి విక్రమార్క చేసిన ప్రకటన వారిలో సంతోషాన్ని నింపుతోంది.
తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని https://t.co/EdZJsf2bTh భట్టి విక్రమార్క చెప్పారు. వారికి APR నుంచి ప్రతినెలా ₹500-600 కోట్ల చొప్పున ₹8,000 కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లిస్తామని JAC నేతలకు హామీ ఇచ్చారు. కొత్త బకాయిలు లేకుండా చూస్తామన్నారు. #Bhattivikramarka pic.twitter.com/LxJb3BlPUD
— Anabothula Bhaskar (@AnabothulaB) March 8, 2025