Praneeth Rao: తెలంగాణలో ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బంధువుల ప్రణీత్‌రావు పాపం పండుతున్నట్లు కనిపిస్తోంది. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో అధికాదుర్వినియోగం, విపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసిన తీరు, సీసీ ఫుటేజీలు, హార్డ్ డిస్క్‌లు ధ్వసం చేసిన తీరుపై ప్రభుత్వానికి నివేదనిక అందింది.
ఫలితాలు వచ్చిన రోజే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గత డిసెంబర్ 3న వెలువడ్డాయి. అదేరోజు రాత్రి ప్రణీత్‌రావు తన కార్యాలయంలోని సీసీ కెమెరాలు ఆఫ్ చేసి 45 హార్డ్ డిస్క్‌లు ధ్వంసం చేసినట్లు గుర్తించారు. ఎస్‌ఐబీలోని కీలక ఫైల్స్ కూడా మాయం చేసినట్లు ధ్రువీకరించారు. ఈమేరకు ప్రభుత్వానికి నివేదిక అందింది. దీని ఆధారంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో అతనిపై ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధమైంది.
ఫోన్ ట్యాపింగ్‌పై ప్రభుత్వం సీరియస్..
ప్రణీత్‌రావు బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్‌రెడ్డి ఫోన్‌ను ట్యాపింగ్ చేసినట్లు తెలుస్తోంది. రహస్యంగా సమాచారం సేకరించడం, వ్యక్తిగత వివరాలను తస్కరించారని తేలింది. ఈమేరకు అధికారదుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. దీంతో రహస్య సమాచారం సేకరణ, వ్యక్తిగత వివరాలు తస్కరించడం వంటి వాటిపై ఐటీ చట్టం కింద కేసులు నమోదుకు రంగం సిద్ధమైంది.
మాజీ అధికారి హస్తం..
ప్రణీత్‌రావు వ్యవహారంలో మాజీ పోలీస్ ఉన్నతాధికారి ప్రమేయం కూడా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రణీత్‌రావుకు త్వరగా ప్రమోషన్ రావడంపైనా విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఈ కేసును సీఐడీ లేదా సిట్‌కు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇప్పటికే సస్పెన్షన్..
ఇదిలా ఉండగా ప్రస్తుతం డీజీపీ ఆఫీస్‌లో పనిచేస్తున్న ప్రణీత్‌రావుపై ప్రభుత్వం ఇప్పటికే సస్పెన్షన్ వేటు వేసింది. గత ప్రభుత్వంలో ఎస్‌ఐబీ పేరుతో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో డీజీపీ సస్పెండ్ చేశారు. కేంద్ర హోంశాఖ అనుమతి లేకుండానే గత ప్రభుత్వ హయాంలో ప్రణీత్‌రావు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఫోన్లు టాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఎవరా మాజీ అధికారి..
ఇక ప్రణీత్‌రావుకు సహకరించిన మాజీ అధికారి ఎవరన్న చర్చ కూడా జరుగుతోంది. ప్రణీత్‌రావు మాజీ ఐపీఎస్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్‌రావు బంధువు. ప్రణీత్ కేరీర్‌లో అడుగడుగునా ప్రభాకర్‌రావు అండగా నిలిచనట్లు తెలుస్తోంది. ప్రభాకర్‌రావు నల్లగొండ ఎస్పీగా ఉన్నప్పుడే ప్రణీత్ ప్రొబేషన్ పూర్తయింది. తర్వాత ప్రభాకర్ ఎస్‌ఐబీ చీఫ్ కాగానే ప్రణీత్‌ను ఎస్‌ఐబీలో పోస్టింగ్ ఇప్పించాడు. సీనియర్లను పక్కనపనెట్టి జూనియర్‌కు ప్రమోషన్లు ఇప్పించారని తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రణీత్‌కు డీఎస్పీగా పదోన్నతి కల్పించారని సమాచారం.