Telangana Cabinet Meeting 2024: తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో గురువారం(ఆగస్టు 1న) జరిగింది. ఈ భేటీలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేసీఆర్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ పేరును భూమాతగా మార్చాలని నిర్ణయించింది. ఇక నిరుద్యోగులు ఎదురు చూస్తున్న జాబ్ క్యాలెండర్‌కు కేబినెట్ ఓకే చెపిపంది. పదేళ్లుగా తెలంగాణలో రేషన్‌కార్డు కోసం ఎదురు చూస్తున్న పేదలకు కూడా శుభవార‍్త చెప్పింది. కొత్త రేషన్‌కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది.
కేబినెట్ నిర్ణయాలు ఇవీ..
– యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లుకు కేబినెట్ ఆమోదంతెలిపింది.
– హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి రూ.437 కోట్లు విడుదలకు కేబినెట్ ఓకే.
– బాక్సర్ నిఖత్ జరీన్, క్రికెటర్ సిరాజ్‌లకు ఇళ్ల స్థలాలు, గ్రూప్-1 స్థాయి ప్రభుత్వ ఉద్యోగం. ఒక్కొక్కరికీ 600 గజాల చొప్పన హైదరాబాద్‌లో ఇంటి స్థలం ఇవ్వాలని నిర్ణయించింది.
– జీహెచ్ఎంసీలో ఔటర్ గ్రామాల విలీనానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో సభ్యులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, శ్రీధర్ బాబు ఉంటారు.
– కొత్త రేషన్ కార్డులకు కేబినెట్ ఆమోదం. దీనికి సంబంధించిన విధివిధానాల ఖరారుకు మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన కమిటీ వేయాలని నిర్ణయించింది. సభ్యులుగా పొంగులేటి, దామోదర రాజనర్సింహ ఉంటారు.
– రేపు(శుక్రవారం) అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయనున్న ప్రభుత్వం.
– నిజాం షుగర్ ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభించాలని క్యాబినెట్ నిర్ణయం
– గవర్నర్ కోటాలో కోదండరాం, అమీర్ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నియమించేందుకు గవర్నర్‌కి రికమండ్ చేయాలని కేబినెట్ నిర్ణయం
– మూసీలో ఎప్పటికీ ఫ్రెష్ వాటర్ ఉండేలా తగు నిర్ణయాలు తీసుకున్న కేబినెట్
– గోదావరి నీటిని మల్లన్నసాగర్‌కు అక్కడి నుంచి శామీర్‌పేట్ చెరువు, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ తరలించాలని కేబినెట్ నిర్ణయించింది.
– హైదరాబాద్ అభివృద్ధికి విదేశీ ద్రవ్య సంస్థల నుంచి రుణాలు సమకూర్చుకునే అవకాశానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్
కేబినెట్ భేటీ అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భేటీలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. గవర్నర్ కోటాలో కోదండరాం, అమీర్ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నియమించేందుకు గవర్నర్‌కి రికమండ్ చేయాలని కేబినెట్ నిర్ణయించిందని చెప్పారు. రేపు (శుక్రవారం) అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారు. అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు విడివిడిగా ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందని వెల్లడించారు రేషన్ కార్డుల కోసం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన, దామోదర రాజనరసింహా, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సభ్యులుగా సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇటీవల విధినిర్వహణలో మరణించిన డీఐజీ రాజీవ్ రతన్ కొడుకు హరీ రతన్‌కు మున్సిపల్ కమిషనర్‌గా ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించిందని పేర్కొన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు కోసం నిధులు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందని చెప్పారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Ration cards job calendar sensational decision to be taken in telangana cabinet meeting
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com