Bittiri satti : బిత్తిరి సత్తి… అలియాస్ చేవేళ్ల రవి. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివారు ఉండరు. పలు న్యూస్ ఛానెళ్లలో పనిచేసిన ఆయన తనకంటూ ప్రత్యేగ గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలంగాణ యాస, వింతైన హావభావాలతో అందరినీ ఆకట్టుకున్నారు. వీ6లో ప్రసారమయ్యే తీన్మార్ వార్తలతో వెలుగులోకి వచ్చాడు. తర్వాత టీవీ9, సాక్షి న్యూస్ ఛానెళ్లలోనూ పనిచేశారు. వీ6లో సావిత్రి, బిత్తిరి సత్తి కాంబినేషన్ బాగా సక్సెస్ అయింది. అయితే తర్వాత కాలంలో ఆ వార్తల రేటింగ్ తగ్గడంతో బిత్తిరి సత్తి బయటకు వచ్చేశారు. న్యూస్ రీడర్‌గా ఉన్నప్పుడే కొన్ని సినిమాల్లో నటించారు. తుపాకి రాముడు సినిమాలో హీరోగా కూడా చేశారు. కొన్ని సినిమా ఫంక్షన్లకు యాంకర్‌గా, గెస్ట్‌గా, వ్యవహరించారు. కొన్ని టీవీ ప్రోగ్రాంలలో కూడా పార్టిసిపేట్ చేశారు. ప్రస్తుతం సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టుకుని ప్రోగ్రాంలు చేస్తున్నారు. తాజాగా ఆయన ఓ వివాదంలో చిక్కుకున్నాడు. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే భగవద్గీతను కించపరిచేలా బిత్తిరిసత్తి చేసిన వీడియో ఇపుపడు కాంట్రవర్సీకి కారణమైంది. దీనిపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. దీంతో ఆగ్రహించిన ఈ సంఘాలు బిత్తిరి సత్తిపై సైబర్ క్రై మ్ లో ఫిర్యాదు చేశాయి. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
జీరో నుంచి హీరో వరకు..
బిత్తిరి సత్తి మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. జీరో స్థాయి నుంచి హీరో వరకు ఎదిగాడు ఇందుకు ఎంతో కష్టపడ్డాడు. న్యూస్ రీడర్ నుంచి సినిమాలో హీరోగా కూడా చేశారు. అయితే.. ఎంత ఎదిగినా.. ఒదిగి ఉంటాలంటారు. కానీ బిత్తిరి సత్తి.. తన సెలబ్రిటీ ఇమేజ్‌ను దుర్వినియోగం చేసి చాలాసార్లు కాంట్రవర్సీ అయ్యాడు. తాజాగా ఆయన చేసిన ఓ వీడియోలో భగవద్గీతను అనుకరిస్తూ.. తనదైన శైలిలో వ్యంగ్యంగా బిత్తిరి సత్తి చేసిన స్కిట్‌పై నెటిజన్స్ మండిపడుతున్నారు. అటు హిందూ సంఘాలు కూడా ఈ బిత్తిరి సత్తి చేసిన ఈ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వీడియో హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉందని మండిపడుతున్నాయి. ఈ సందర్బంగా ప్రముఖ హిందూ సంఘం అయిన రాష్ట్రీయ వానరసేన వాళ్లు ఈ వీడియోపై బిత్తిరి సత్తికి అల్టీమేటం జారీ చేశారు. అంతేకాదు సోషల్ మీడియాలో వీడియోను తెలిగించి హిందూ సంఘాలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
సమర్ధించుకున్న సత్తి..
ఇదిలా ఉంటే.. బిత్తిరి సత్తి తన వీడియోలో హిందువులను కించపరిచేలా లేవని సమర్ధించుకున్నాడు. హిందూ సంఘాలు తనపై ఎలాంటి కేసులు పెట్టిన ఎదుర్కోవడానికి సిద్దమని వాళ్లకు సవాల్ విసిరారు. దీంతో హిందూ వానర సేన సభ్యులు సైబర్ క్రై మ్ పోలీసులను ఆశ్రయించి బిత్తిరి సత్తిపై కేసు నమోదు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో సైబర్ క్రై మ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
బీఆర్‌ఎస్ కార్యకర్తగా..
ఇదిలా ఉంటే.. బిత్తిరిసత్తి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అప్పటి ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున ప్రచారం చేశారు. ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన బిత్తిరి సత్తి చేరికతో పార్టీకి బలం పెరిగిందని హరీశ్‌రావు కూడా ప్రకటించారు. కానీ, ఎన్నికల్లో ఫలితాలు వ్యతిరేకంగా రావడంతో బిత్తిరిసత్తి పార్టీకి కూడా దూరంగా ఉంటున్నారు.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Rashtriya vanara sena files cyber crime case against bitthiri satti for defaming bhagavad gita
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com