Rasamayi political prediction: రసమయి బాలకిష్.. ఈ పేరు తెలంగాణ ప్రజలకు సుపరిచితమే.. గోసి గొంగడి వేసి.. కాలికి గజ్జకట్టి.. తెలంగాణ ఉద్యమానికి తన పాటలతో ఊపు తెచ్చారు. ధూంధాం పేరుతో సబ్బండ వర్గాలను ఏకం చేయడంలో కీలకపాత్ర ఫోషించారు. ఆయన పోరాటానికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గుర్తింపు వచ్చింది. బీఆర్‌ఎస్ అలియాస్ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మానకొండూర్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించాడు. 2014, 2018లో రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యాడు. 2023 ఎన్నికల్లో ఓడిపోయారు. ఓటమి తర్వాత సైలెంట్ అయిన రసమయి.. తాజాగా మళ్లీ గొంతెత్తుతున్నాడు.
రసమయి రాజకీయ జోష్యం..
రసమయి ఇప్పుడు రాజకీయ జ్యోతిష్యుడి అవతారం ఎత్తారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు కామన్. రాజకీయ అనుభవం ఉన్న రసమయి ఈ విషయం మర్చిపోయాడు. తన జోష్యంతో కాంగ్రెస్ పార్టీకి రాజకీయ రిటైర్మెంట్ సర్టిఫికెట్ జారీ చేశారు. ‘ఇదే వాళ్ల చివరి పాలన‘ అని ప్రకటించారు. అంతటితో ఆగకుండా.. మళ్లీ గెలిస్తే తన తలను నరుక్కుని గాంధీభవన్‌కు వేలాడదీస్తానని ఛాలెంజ్ చేశారు. రాజకీయాల్లో ఇలాంటి సవాళ్లు కామన్. గతంలో బండ్ల గణేశ్ కూడా ఇలాంటి సవాలే చేశారు. కాంగ్రెస్ గెలవకుంటే తన నాలుక కోసుకుంటానని ప్రకటించారు. కాంగ్రెస్ గెలవలేదు. దీంతో అప్పుడు అందరూ బ్లేడ్ చూపిస్తూ ఆటాడుకున్నారు.
Also Read: చెల్లి ఒక దారిలో.. అన్న కేటీఆర్ మరో దారిలో.. బీఆర్ఎస్ ఎటుపోతోంది?
ఓవర్ డోస్ డ్రామా బాబా..
రసమయి ‘మరణ వాంగ్మూలం’ రాసిస్తా అంటూ పాత్రికేయులకు థ్రిల్లర్ డాక్యుమెంట్ చూపించాడు. ట్విస్ట్ ఏంటంటే, దాని పాత్రికేయుల సాక్షిగా చెప్పడం. ఇది నిజంగా రాజకీయ స్టంటా, లేక కాంగ్రెస్‌పై ఉన్న అసహనం ఫుల్ స్క్రీన్ సినిమా రూపంలో ప్రదర్శనా? గాంధీ భవన్ దగ్గర తల వేలాడదీసే ఈ సీన్ ఎప్పటికైనా రియాలిటీ అవుతుందా, లేక ఖాళీ డైలాగ్‌లతో సినిమా ఫ్లాప్ అవుతుందా?
రివెంజ్ స్టోరీ..
కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే తల ఇస్తానన్న రసమయి, రాజకీయంగా ఈ పార్టీకి శాశ్వత గుండెపోటు స్టోరీ రాస్తున్నారా? లేక బీఆర్‌ఎస్ కోసం జనాల్లో జోష్ నింపే కొత్త స్క్రిప్ట్ రాస్తున్నారా? ఈ సవాల్ వెనుక రాజకీయ రసాయనం ఏంటో తెలుసుకోవాలంటే, గాంధీ భవన్ గేటు దగ్గర కాస్త వెయిట్ చేయాల్సిందే!
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇది చివరి పాలన.
జీవితంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదు. ఒకవేళ వస్తే నా తల తీసి గాంధీ భవన్ దగ్గర వేలాడదీయండి.
పాత్రికేయుల సాక్షిగా మరణ వాంగ్మూలం రాసిస్తా – BRS మాజీ ఎమ్మెల్యే రసమయి pic.twitter.com/ownwOzZVIh
— greatandhra (@greatandhranews) July 9, 2025