Ramoji Rao Luxury : రామోజీ.. ఈ పేరు తెలియని వారు ఉండరు.. అర్ధశతాబ్దంగా మీడియా రంగాన్ని శాసిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద వ్యాపారా సమ్రాజ్యాధినేతగా వెలుగొందుతున్నారు. అటు రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ.. అవార్డులు, రివార్డులు, పురస్కారాలు అందుకుంటున్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియారంగంలో తనదైన ముద్ర వేసిన రామోజీరావు ఫిలింసిటీతో ఆసియాలోనే గుర్తింపు పొందారు. ఆయనను రామోజీ అనడం కంటే రాజు అంటే అతిశయోక్తి కాదు అనిపిస్తుంది. 7 పదుల వయసు దాటిన రామోజీ ఇప్పటికీ తన ఆలోచనలతో శత్రువులను చిత్తుచేయగల సమర్థుడు.
రామోజీతో నడ్డా భేటీ..
ఇదిలా ఉంటే.. రామోజీని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా శుక్రవారం కలిశారు. మర్యాదపూర్వక భేటీలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కూడా పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జాతీయ స్థాయిలోని బీజేపీ నేతల దృష్టంతా ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలపైనే ఉందని అంటున్నారు. పైగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇచ్చిన షాక్తో ఈసారి ఈ రెండు దక్షిణాది రాష్ట్రాలపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తుంది. అయితే ఏపీలో అంతసానుకూల వాతావరణం ఉన్నట్లు కనిపించనప్పటికీ తెలంగాణలో మాత్రం హోప్స్ ఎక్కువగానే పెట్టుకున్నారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు జేపీ.నడ్డా. ఈ సందర్భంగా రామోజీరావు, రాధాకృష్ణను కలిశారు. వీరిద్దరితోనూ విడివిడిగా చాలాసేపు భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను జేపీ నడ్డా స్వయంగా తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు. ఈ సమయంలో రామోజీ చాలా యాక్టివ్ గా కనిపించారు.
ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..
ఈ భేటీపైనా, ఈ సందర్భంగా రామోజీ యాక్టివ్గా కనిపించడంపైనా.. నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడూతూ రామోజీని ట్రోల్స్ చేస్తున్నారు. సీఐడీ అధికారులు వచ్చినప్పుడు రామోజీ మంచంపై పడుకున్న ఫొటోల్ని షేర్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ కి సంబంధించిన కేసులో సీఐడీ అధికారులు ఇంటికి వస్తే నడుముకి బెల్ట్ పెట్టుకుని, మంచంపై పడుకున్న రామోజీరావు ఇతరులు ఎవరైనా వస్తే మాత్రం ఇలా కుర్చీలో కూర్చుని యాక్టివ్ గా కనిపిస్తారంటూ ఫొటోలు పెట్టి ట్రోల్స్ చేస్తున్నారు.
ఖరీదైన సోఫాలు..
ఇక రామోజీరావు, నడ్డా భేటీలో కనిపించిన సోఫాలు కూడా ఇప్పుడు నెట్టింట్లోల వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు రాజుల సింహాసనాన్ని తలపించేలా ఉన్న ఈ సోఫాలు పూర్తిగా బంగారు వర్ణంలో ధగధగ మెరిసిపోతున్నాయి. రామోజీరావు కూర్చున్న సోఫా అయితే సింహాసనాన్ని తలపిస్తుంది. ఇంత అంతంగా, దర్జాను పెంచేలా ఉన్న ఈ సోఫాల ఖరీదు అక్షరాలా ఏడు కోట్ల ఇరవై మూడు లక్షలు అట. ఈ విషయాన్ని రామోజీ మీడియా సంస్థకు చెందిన వ్యక్తే చెప్పినట్లు సోషల్ మీడియాలో కొందరు వైరల్ చేస్తున్నారు. మరి ఇది నిజమా? నిజంగానే రామోజీ బంగారు సింహాసనంపై కూర్చుంటున్నారా? అన్న నిజానిజాలు తెలియాల్సి ఉంది.