Ponnam Prabhakar: తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పవర్ హౌస్‌గా మారింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌కు మంత్రి వపదవి దక్కింది. హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఇక రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు మంత్రులుగా ఉన్నారు. పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను అనూహ‍్యంగా మంత్రి పదవులు వరించాయి. తాజాగా పొన్నం ప్రభాకర్‌కు ప్రమోషన్ దక్కబోతుందన్న ప్రచారం జరుగుతోంది.
Also Read: ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలు తప్పు.. వైసిపి చేసింది అంతకంటే తప్పు
మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ..
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తోంది. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై దృష్టిపెట్టారు. ఈమేరకు కసరత్తు మొదలు పెట్టారు. బీసీ కోటాలో మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ప్రమోషన్ కల్పించే యోచనలో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలోనే ప్నొంకు ఉప ముఖ్యమంత్రి పదవి ఖాయమని భావించారు. కానీ, మారిన రాజకీయ పరిస్థితులు, పార్టీ అంతర్గత సమీకరణాల నేపథ్యంలో సమీకరణాలు మారినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు కూడా డిప్యూటీ సీఎం రేసులోకి వచ్చారు.
ఎందుకు ఈ మార్పు?
మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ వెనుక అనేక కారణాలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు, 2029 అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పార్టీని బలపరచాల్సిన అవసరం ఉంది. పొన్నం ప్రభాకర్ క్షేత్ర స్థాయి నేతగా, ఉద్యమకారుడిగా పార్టీ సంస్థాగత బాధ్యతలు నిర్వహించగల సామర్థ్యం కలిగి ఉన్నారు. దీంతో ఆయనకు డిప్యూటీ సీఎం లేదా పీసీసీ చీఫ్ పది ఇచ్చే యోచనలో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది. మహేశ్‌కుమార్‌గౌడ్ కూడా బీసీ నేతే కావడంతో, ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తే సామాజిక న్యాయం కూడా జరిగినట్లు అవుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఆయన ప్రస్తుతం పీసీసీ చీఫ్‌గా ఉఆ‍్నరు. ఆయన పదవీకాలం కూడా జూన్‌తో ముగుస్తుంది.
పొన్నంకు ప్రాధాన్యం..
హుస్నాబాద్ ఎమ్మెల్యేగా, మంత్రిగా పొన్నంకు మంచి ప్రజాదారణ ఉంది. కరీంనగర్ జిల్లాలో ఆయన పట్టు బలంగా ఉంది. పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఉంటే, ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పట్టు మరింత పెరుగుతుంది. పొన్నం ప్రభాకర్ రాజకీయ ప్రస్థానం విద్యార్థి నాయకుడిగా మొదలైంది. కాంగ్రెస్ పార్టీలో కష్టకాలంలో కూడా పార్టీకి విధేయంగా ఉన్నారు. 2023 ఎన్నికల్లో హుస్నాబాద్ నుంచి గెలిచి, విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాడే తీరు, ప్రతిపక్షాలపై విరుచుకుపడే శైలి ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. డిప్యూటీ సీఎం పదవి ఆశించినా, పీసీసీ చీఫ్ బాధ్యతలు అంగీకరిస్తే పార్టీని మరింత బలోపేతం చేసే అవకాశం ఉంది.
పీసీసీ చీఫ్ నుంచి డిప్యూటీ సీఎం రేసులో
ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ 2023 ఎన్నికల్లో పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు చురుకుగా సాగాయి. డిప్యూటీ సీఎం పదవి లభిస్తే, ఆయన ప్రభుత్వ పరమైన బాధ్యతలు నిర్వహిస్తూ, పార్టీకి మార్గదర్శకత్వం అందించగలరు. ఇది పార్టీ-ప్రభుత్వ సమన్వయానికి దోహదపడుతుంది.
మే నెలలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది. ఆలోగా పునర్‌వ్యవస్థీకరణపై సీఎం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. పొన్నం ప్రభాకర్కు డిప్యూటీ సీఎం లేదా పీసీసీ చీఫ్ పదవి లభిస్తే, తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలవుతుంది.