https://oktelugu.com/

Telangana Polling : తెలంగాణలో ప్రశాంతంగా పోలింగ్.. ఉదయం 11 గంటల వరకూ 20.64 శాతం నమోదు

ఉదయం 11 గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20.64 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఆదిలాబాద్‌లో అత్యధికంగా 30.65 శాతం పోలింగ్‌ నమోదైంది.

Written By:
  • NARESH
  • , Updated On : November 30, 2023 5:44 pm
    Follow us on

    Telangana Polling : తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోంది. చెదురుమదురు సంఘటనలతో మొత్తం శాంతియుత వాతావరణం నెలకొందని నివేదికలు సూచిస్తున్నాయి. ఉదయం 11 గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20.64 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఆదిలాబాద్‌లో అత్యధికంగా 30.65 శాతం పోలింగ్‌ నమోదైంది.

    -జిల్లాల వారీగా పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి.

    – భద్రాద్రి: 22.05%
    – హనుమకొండ: 21.43%
    – హైదరాబాద్: 12.39%
    – జగిత్యాల: 22.50%
    – జనగామ: 23.25%
    —భూపాలపల్లి: 27.80%
    – గద్వాల: 29.54%
    – కామారెడ్డి: 24.70%
    – కరీంనగర్: 20.09%
    – ఖమ్మం: 26.03%
    – కుమురభీం: 23.68%
    – మహబూబాబాద్: 28.05%
    – మహబూబ్‌నగర్: 23.10%
    – మంచిర్యాల: 24.38%
    – మెదక్: 30.27%
    – మేడ్చల్ మల్కాజిగిరి: 14.74%
    —ములుగు: 25.36%
    —నాగర్ కర్నూల్: 22.19%
    – నల్గొండ: 22.74%
    – నారాయణపేట: 23.11%
    – నిర్మల్: 25.10%
    – నిజామాబాద్: 21.25%
    – పెద్దపల్లి: 26.41%
    – రాజన్న సిరిసిల్ల: 22.02%
    – రంగారెడ్డి: 16.83%
    — సంగారెడ్డి: 21.99%
    – సిద్దిపేట: 28.08%
    – సూర్యాపేట: 22.58%
    – వికారాబాద్: 23.16%
    – వనపర్తి: 24.10%
    – వరంగల్: 18.73%
    – యాదాద్రి భువనగిరి: 24.29%

    పలు చోట్ల గొడవలు, ఆందోళనలు జరిగిన్నప్పటికీ, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న వ్యక్తులు కూడా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనడం ద్వారా తమ నిబద్ధతను చాటారు..

    కామారెడ్డి బాలుర పాఠశాలలో పోలింగ్‌ కేంద్రాల వద్ద టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సోదరుడు అక్రమంగా వచ్చాడని.. నాన్‌ లోకల్‌ వ్యక్తులు రావడంపై బీఆర్ఎస్, కాంగ్రెస్‌ నాయకులు ఆందోళన చేశారు. వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు.

    వివిధ రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు, ఈ ప్రజాస్వామ్య యుద్ధంలో అందరూ పాల్గొనాలని పౌరులను ప్రోత్సహించారు.