Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ సోషల్ మీడియాలో సెటైరికల్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీ వీడియోలు పోస్టు చేస్తుంటే.. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ నేతలు పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే కేటీఆర్ చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తాజాగా రేవంత్‌రెడ్డికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.
చంద్రబాబు ప్రచారం..
రేవంత్‌రెడ్డి తరఫున హైదరాబాద్‌లో చంద్రబాబు నాయకుడు ప్రచారం చేస్తున్నట్లు ఓ వీడియోను తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఇందులో చంద్రబాబు, రేవంత్ మాస్క్ ధరించిన ఇద్దరు వ్యక్తులు ఓ బ్యాగు పట్టుకుని రోడ్లపై తిరుగుతున్నారు. ఇందులో చంద్రబాబు మాస్కు ధరించిన వ్యక్తి..‘బ్రదర్ రూ.50 లక్షలు ఇస్తా.. రేవంత్‌కు ఓటేయండి’ అని కోరడం కనిపించింది. రోడ్లపై నడుచుకుంటూ వెళ్తున్నవారిని, చిరు వ్యాపారులను, సెక్యూరిటీ గార్డులను ఈ విధంగా ఓటు అడుగుతూ కనిపించారు.
నెట్టింట్లో వైరల్…
ఇప్పుడు ఈ వీడియోను బీఆర్‌ఎస్ నాయకులు సోషల్ మీడియాలో పోస్టు చేసి ట్రోల్ చేస్తున్నారు. కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ చంద్రబాబు పాలన వస్తుందని తెలిపేలా ఈ వీడియో ఉంది. 2018 ఎన్నికల్లో కూడా చంద్రబాబును బూచిగా చూసే బీఆర్‌ఎస్ భారీగా సీట్లు గెలిచింది. అందుకే బీఆర్‌ఎస్ నాయకులు ఈసారి కూడా చంద్రబాబు పేరు చెప్పి తెలంగాణ ఓటర్లను భయపెట్టే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
— Anitha Reddy (@Anithareddyatp) November 30, 2023