Telangana Elections 2023: ఎగ్జిట్ పోల్ సర్వేలకు సర్వం సిద్ధం.. అవి ఎలా చేస్తారంటే?

ఎగ్జిట్ పోల్స్ అనేది ఒక నిర్దిష్ట ఎన్నికలలో ఓట్లు ఎలా పడ్డాయి అనే దాని గురించి ప్రాథమిక సమాచారం. దీనిని జాతీయ మీడియా సంస్థలు, ఇతర ఏజెన్సీలు నిర్వహించే ఓటరు సర్వేలు ఎగ్జిట్ పోల్స్ ఓటింగ్ సరళి గురించి వెల్లడిస్తాయి.

Written By: Dharma, Updated On : November 30, 2023 1:18 pm

Telangana Elections 2023

Follow us on

Telangana Elections 2023: ఎన్నికల సమయంలో సర్వేల మాట ప్రధానంగా వినిపిస్తుంటుంది. పేరు మోసిన మీడియా సంస్థలు, ఏజెన్సీలు ఈ సర్వే ప్రక్రియ నిర్వహిస్తుంటాయి. అయితే ఈ సర్వేల్లో సైతం ఎన్నికల ముంగిట చేసినవి.. పోలింగ్ రోజు చేసినవి ఉంటాయి. ఎన్నికల ముందు చేసే వాటికి ఫ్రీ పోల్ సర్వే అంటారు. పోలింగ్ నాడు చేసిన వాటిని ఎగ్జిట్ పోల్ ఫలితాలు అంటారు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల పోలింగ్ పూర్తికావడంతో ఎగ్జిట్ పోల్ సర్వేలు సందడి చేయనున్నాయి. ఇందుకు జాతీయ మీడియా సంస్థలు, ఏజెన్సీలు ఎగ్జిట్ పోల్స్ చేయడంలో బిజీగా ఉన్నాయి.

ఎగ్జిట్ పోల్స్ అనేది ఒక నిర్దిష్ట ఎన్నికలలో ఓట్లు ఎలా పడ్డాయి అనే దాని గురించి ప్రాథమిక సమాచారం. దీనిని జాతీయ మీడియా సంస్థలు, ఇతర ఏజెన్సీలు నిర్వహించే ఓటరు సర్వేలు ఎగ్జిట్ పోల్స్ ఓటింగ్ సరళి గురించి వెల్లడిస్తాయి. తద్వారా విజేతలను అంచనా వేయడంలో ఉపయోగపడతాయి. అయితే కొన్నిసార్లు ఎగ్జిట్ పోల్ ఫలితాలు తారుమారవుతాయి. కొన్ని ప్రత్యేక సంస్థలు ఎన్నికల ముందు పీపుల్స్, ఎన్నికల తర్వాత ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తాయి. రీపోల్స్ సర్వేలనేవి ఎన్నికల నోటిఫికేషన్ రాక మునుపు చేపట్టే ప్రక్రియ. పార్టీల మధ్య పొత్తులు, సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక ప్రభావం ఎలా ఉండబోతుందని విశ్లేషిస్తాయి. పోలింగ్ తేదీ సమీపించినప్పుడు నియోజకవర్గాల వారీగా ఓటర్లను సెలెక్ట్ చేసుకుని ఫ్రీ పోల్స్ నిర్వహిస్తారు. నియోజకవర్గాల ను ఒక యూనిట్ గా తీసుకొని అక్కడ ఏ అభ్యర్థి నిలబడతారు? ఏ పార్టీకి గెలుపు అవకాశముంది? తదితర వివరాలను సేకరిస్తారు. ప్రజాభిప్రాయం ఇది అంటూ ఫలితాలు వెల్లడిస్తారు.

ఎగ్జిట్ పోల్స్ విషయంలో అలా కాదు. పోలింగ్ రోజే ఓటర్ మనోగతం తెలుసుకుంటూ సర్వే చేస్తారు. చేసుకున్న కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓట్ల నాడీని తెలుసుకొని ఒక అంచనాకు వస్తారు. అలా చెప్పే వివరాలతో ఓ నివేదికను రూపొందిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో లెక్క కడతారు. అయితే నిర్దిష్ట ప్రక్రియలో ఈ వివరాల సేకరణ ఉంటుంది. రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, యువత, వికలాంగులు, వృద్ధులు, మహిళలు, కులం, మతం, పేదలు, మధ్యతరగతి.. తదితర వర్గాల వారీగా ఓటర్లను ఎంచుకొని సర్వే చేస్తారు. తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ నేటితో ముగియనుంది. సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించడానికి ఆయా మీడియా సంస్థలు, ఏజెన్సీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.