Ganesh Immersion Politics: గణేష్ నిమజ్జనం వేడి రగులుకుంటోంది. ప్రభుత్వంపై బీజేపీ విరుచుకుపడుతోంది. టీఆర్ఎస్ కావాలనే దురుద్దేశంతోనే నిమజ్జనంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తోంది. వినాయకుడి నిమజ్జనం హుస్సేన్ సాగర్ లో కాదు ప్రగతి భవన్ లో చేస్తామని ఘాటు వ్యాఖ్యలు చేయడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. గణేష్ నిమజ్జనం కోసం ఎక్కడ ఏర్పాట్లు చేశారు? ఎందుకు ఇంత ఉదాసీనత అని ప్రశ్నిస్తున్నారు. దీంతో రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.

గత ఏడాది ప్లాస్టర్ ఆఫ్ ఫ్యారిస్ విగ్రహాలు హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయొద్దని కోర్టు ఆదేశాలివ్వడంతో ప్రభుత్వం ఆ దిశగా ఏర్పాట్లు చేయలేదు. దీంతో బీజేపీ దీన్ని అవకాశంగా తీసుకుని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నగరంలో ఎక్కువగా ప్లాస్టర్ ఆఫ్ ఫ్యారిస్ విగ్రహాలే ఉండటంతో ఇక నిమజ్జనం విషయం ఏం తేల్చారని ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. దీనిపై ప్రభుత్వం కూడా ఏం చెప్పలేకపోతోంది. గణేష్ నిమజ్జనంపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని విమర్శలు చేస్తున్నారు.
Also Read: JD Lakshmi Narayana: జేడీ లక్ష్మీనారాయణ పొలిటికల్ రీ యాంట్రీ…డేట్ ఫిక్స్
గణేష్ నిమజ్జన సమితి, హిందూ ఉత్సవ సమితి, భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా ప్రభుత్వ తీరుకు నిరసనగా నేడు నగరంలోని ట్యాంక్ బండ్ మీద ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించాలని భావించింది. దీంతో రాజకీయం ఎటు వైపు తిరుగుతుందో కూడా తెలియడం లేదు. మొత్తానికి విఘ్నాలు పాపే వినాయకుడికే సమస్య వచ్చినట్లు అయింది. నిమజ్జనం ఎక్కడో తేల్చడం లేదు. అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయడం లేదు. దీంతో పరిస్థితి ఎటు వెళ్తుందో కూడా అంతుచిక్కడం లేదు.

ప్రభుత్వం నిమజ్జనం విషయంలో ఏం చర్యలు తీసుకుంటుందో కూడా తెలియడం లేదు. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేస్తే నీళ్లు కలుషితం అవుతున్నాయని కోర్టు తీర్పునివ్వడంతో కనీసం ప్రత్యామ్నాయ మార్గాలైనా ఏర్పాటు చేయాలి కదా. అవి కూడా చేయడం లేదంటే ప్రభుత్వం తీరుపై సహజంగానే విమర్శలు రావడం తెలిసిందే. దీంతో ప్రభుత్వం గణేష్ నిమజ్జనంపై ఇంకా చర్యలు చేపట్టకపోవడం ఆందోళనలకు తావిస్తోంది. ఈ సంవత్సరం నిమజ్జనం విషయంలో వచ్చిన చిక్కులతో దేవదేవుడు ఏం పరిష్కారం చూపుతాడో తెలియడం లేదు.
రెండు పార్టీల మధ్య నిమజ్జనం గొడవ పెద్దదవుతోంది. హుస్సేన్ సాగర్ లో ఏర్పాట్లు చేయకుండా ఇతర చోట్ల కూడా ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై అందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో వేల సంఖ్యలో విగ్రహాలు ఉండటంతో వాటిని నిమజ్జనం చేయడం సవాలుగా మారింది.