Pawan kalyan: పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాకముందు చాలా ఆత్మన్యూన్యతతో బాధపడేవారట.. ఎవరితోనూ కలిసేవాడు కాదట.. పదిమందిలో ఉండేవాడు కాదట.. ఎవరు ఏమనుకుంటారో అని గదిలోనే ఉండేవాట.. తమ్ముడు పవన్ ఏమైపోతాడోనని చిరంజీవి కూడా తెగ బాధపడిపోయాడట.

చదువుల్లో ఫెయిల్ కావడంతో ఇక సినిమాల్లో ట్రై చేయమని సూచించాడు.కానీ ఆ సినిమాలు మూడేళ్లు షూటింగ్ జరిగి రిలీజ్ కాకపోవడంతో బెంగలూరు వెళ్లి తనకు తెలిసిన నర్సరీ పని చేసుకుందామని అనుకున్నాడట.. ఈ క్రమంలోనే ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా చేశాడట.. జీవితంలో ఏమీ సాధించలేక ఇలా ఒంటరిగా ఉండడం ఇష్టం లేక పవన్ కళ్యాణ్ సూసైడ్ అంటెప్ట్ కూడా చేసినట్టు ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు.
Also Read: Payal Rajput: బాత్ రూమ్ లో పాయల్ సెల్ఫీ వీడియో… ఏమీ లేకుండా కనిపించి షాక్ ఇచ్చిన ఆర్ఎక్స్ 100 బ్యూటీ
పవన్ కళ్యాణ్ ఇంటర్ మీడియెట్ తో చదువును ఆపేశాడు. అనంతరం మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్నాడు. కళ్యాణ్ బాబు అనే పేరును ‘పవన్ కళ్యాణ్’ మార్చుకొని 1996లో ‘అక్కడ అమ్మాయి-ఇక్కడ అబ్బాయి’ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు.
ఆ తర్వాత వచ్చిన గోకులంలో సీత, సుస్వాగతం సినిమాలతో హీరోగా టాలీవుడ్ లో నిలదొక్కుకున్నాడు. 1999లో విడుదలైన ‘తొలిప్రేమ’ మూవీ పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి ఆయన జీవితాన్ని మలుపుతిప్పింది. ఆ తర్వాత ‘తమ్ముడు’, ఖుషి, జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, గోపాల గోపాల, వకీల్ సాబ్, భీమ్లానాయక్ సినిమాలు పవన్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ మూవీస్ అని చెప్పొచ్చు.

ఒకప్పుడు ఆత్మహత్య చేసుకుందామనుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు పరిపూర్ణ వ్యక్తిగా రూపాంతరం చెందాడు. అటు హీరోగా.. ఇటు రాజకీయ నేతగా సామాజిక సేవకుడిగా రాణిస్తున్నాడు.
[…] […]