Political Broker: కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు నీరారాడియా వ్యవహారం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. వైట్ కలర్ దుస్తులతో.. అందమైన రూపంతో.. ఆకట్టుకునే గొంతుతో నీరా మామూలు వ్యవహారాలు సాగించలేదు. పెద్దపెద్ద కార్పొరేట్ వ్యక్తులు కూడా నీరా వద్ద పడిగాపులు కాసారంటే.. ఆమె స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. దురదృష్టం కొద్దీ ఆమె వ్యవహారం బయట పడింది గానీ.. లేకపోతే ఇంకా మరింత దున్నుకునేది.
వాస్తవానికి మధ్య వర్తులను మన సమాజం బ్రోకర్లు అని పిలుస్తోంది గాని.. వారు లేకపోతే ఏదైనా పని జరుగుతుందా.. మీకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కావాలన్నా.. ఒక ఫ్లాట్ కొనుగోలు చేయాలన్నా.. ఇల్లు సొంతం చేసుకోవాలన్నా.. బండి రిజిస్ట్రేషన్ కావాలన్నా.. అన్నింట్లోనూ వారే ఉండాలి కదా. ఎంతో కొంత తీసుకుంటారు తప్పదు.. రిస్కు మొత్తం వాళ్ళదే కదా.. అలాంటప్పుడు మన సమాజం వారిని చీదరించుకోవడం ఎందుకు.. చీత్కరించుకోవడం ఎందుకు.. అప్పుడప్పుడో నీరా గురించి మనం చదువుకున్నంగాని.. తెలుగులో ఓ పొలిటికల్ బ్రోకర్ అంతకంటే ఎక్కువ. పొలిటికల్ బ్రోకర్ అనేకంటే ముందు ఈయన జర్నలిస్ట్. ఆ తర్వాత పత్రికాధిపతి. ఛానల్ పెట్టాడు.. వేలకోట్లకు ఎదిగాడు. ఇప్పుడు ఏకంగా పొలిటికల్ బ్రోకరిజం చేస్తున్నాడు. నచ్చిన పార్టీ మీద పూలు కురిపిస్తాడు. నచ్చని పార్టీ మీద రాళ్లు వేయిస్తాడు. తన పత్రికలో.. తన చానల్లో అడ్డగోలుగా వార్త కథనాలను ప్రసారం చేయిస్తాడు. పైగా తనకు తాను గొప్ప జర్నలిస్ట్ గా చెప్పుకుంటాడు. తనకు మాత్రమే విశ్లేషణ తెలుసని.. వర్తమాన రాజకీయ అంశాల మీద అవగాహన ఉందని డబ్బా కొట్టుకుంటాడు. ఇక్కడ దరిద్రం ఏంటంటే.. అతడు బ్రోకర్ అని తెలుసు.. విలువలు, వలువలు ఏమీ లేవని తెలుసు. అయినప్పటికీ ప్రతిపక్షం నుంచి మొదలుపెడితే అధికార పక్షం వరకు ఆయన చుట్టూ తిరుగుతుంటారు.
ఇటీవల ఓ నాయకురాలు రాజకీయ పార్టీ పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. గతంలో ఆయన చానల్లో పలుమార్లు ఆమె ఇంటర్వ్యూలకు కూడా వెళ్లారు. వాస్తవానికి ఆమెకు వాగ్దాటి ఎక్కువ. ఇతర రిపోర్టర్లను ఒక ఆట ఆడుకుంటుంది. కానీ ఆయన నిర్వహించిన ఇంటర్వ్యూలో తెల్ల మొహం వేసింది. ఆయన రెచ్చగొడుతుంటే రెచ్చిపోయి నిజాలు మొత్తం చెప్పేసింది. కానీ ఇప్పుడు అదే నాయకురాలు రాజకీయ పార్టీ పెట్టడానికి ఆ పొలిటికల్ బ్రోకర్ సహకారం తీసుకుంటున్నారని హైదరాబాద్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే డీల్ కుదిరిందని.. కోట్ల ప్యాకేజీ మాట్లాడుకున్నారని తెలుస్తోంది. గతంలో కూడా తెలంగాణ రాజకీయాలలో ప్రవేశించిన ఓ మహిళ కూడా ఈ పొలిటికల్ బ్రోకర్ నే కలిసింది. ఆ తర్వాత అతడు తన పేపర్, చానల్లో విపరీతమైన కవరేజ్ ఇచ్చాడు. అంతకుముందు ఆమె ఏం చేసినా సరే పట్టించుకోలేదు. ఎప్పుడైతే ప్యాకేజీ ముట్టిందో ఆమెకు విపరీతంగా కవరేజ్ ఇవ్వడం మొదలుపెట్టాడు. అతడు దూకుడు చూస్తుంటే త్వరలోనే మరింత వెనకేస్తాడని.. తెలుగు మీడియాను మొత్తం శాసిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. అటు ప్రతిపక్ష, ఇటు అధికార పక్ష పార్టీల సపోర్ట్ ఉండడంతో అతడు చెలరేగిపోతున్నాడు.