Bigg Boss 9 Telugu Dammu Srija: కాసేపట్లో ‘బిగ్ బాస్ 9’ స్టార్ మా ఛానల్ లో గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ద్వారా ఘనంగా మొదలు కాబోతుంది. ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ మీద ఇంత హైప్ రావడానికి ప్రధాన కారణం ‘అగ్నిపరీక్ష’ షో. ఈ షో ద్వారా వేలల్లో వచ్చిన అప్లికేషన్స్ నుండి కేవలం 13 మందిని మాత్రమే అగ్నిపరీక్ష షో లో తీసుకున్నారు. 13 మంది సామాన్యుల ఆట తీరుని గమనించి ప్రేక్షకులు వాళ్లకు ఓట్లు కూడా వేశారు. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ 13 మందిలో కేవలం 5 మంది మాత్రమే హౌస్ లోపలకు అడుగుపెట్టారు. ఆ 5 మందిలో ఒకరు ‘దమ్ము శ్రీజ’. వైజాగ్ కి చెందిన ఈ అమ్మాయి ని ఆడిషన్స్ లో చూసి జడ్జిలు దడుచుకున్నారు. ఈ అమ్మాయి ఏంట్రా బాబు ఇంత వింతగా ఉంది, ఈమె హౌస్ లోకి వస్తే ఆడియన్స్ కి అగ్నిపరీక్ష అంటూ సెటైర్లు విసిరారు ఆడియన్స్.
అభిజిత్, బిందు మాధవి ఈమెకు రెడ్ ఫ్లాగ్ ఇచ్చేశారు. కానీ నవదీప్ మాత్రం ఏంటో చూద్దాం ఈమె సంగతి అని గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చి హోల్డ్ లో పెట్టాడు. ఆయన ఇచ్చిన ఆ ఒక్క అవకాశాన్ని ఈ అమ్మాయి ఉపయోగించుకున్న విధానం చూస్తే శభాష్ అనే అనాలి. అగ్నిపరీక్ష లో నిర్వహించిన ప్రతీ టాస్క్ లో అద్భుతంగా ఆడిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది దమ్ము శ్రీజా మాత్రమే. అందుకే ఈమెని జడ్జీలు నేరుగా హౌస్ లోపలకు పంపేశారు. ఆడియన్స్ ఓటింగ్ లో కూడా ఈ అమ్మాయి టాప్ లో ఉంది. ఇంతకీ ఎవరు ఈ దమ్ము శ్రీజా?, ఈ చిచ్చర పిడుగు అసలు బయట ఏమి చేస్తూ ఉంటుంది అని ఈమె గురించి ఆరాలు తీయగా, రీసెంట్ గానే ఈమె ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది.
ఆ ఇంటర్వ్యూ లో ఈమె గురించి అనేక విషయాలు తెలిసాయి. ఈమె ఒక ప్రముఖ MNC కంపెనీ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి గా పని చేస్తుంది. నెలకు లక్ష రూపాయిల జీతం. అలాంటి జాబ్ ని వదిలేసి, అసలు బిగ్ బాస్ లోకి వెళ్తానో లేదో తెలియకపోయిన, తనని తానూ బలంగా నమ్మి, ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చిందంటే, ఈమె ధైర్యం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ ద్వారా ఇప్పటికే ఈమె చాలా పాపులర్, మరి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన తర్వాత ఈమె ఎలా ఉంటుందో చూడాలి.