Stock Market : నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) ప్రధాన పండుగలు, పబ్లిక్ సందర్భాలలో సెలవులను పాటిస్తుంది. 2025లో న్యూ ఇయర్ డే, రిపబ్లిక్ డే, హోలీ, దీపావళి, క్రిస్మస్ నాడు ఎన్ఎస్ ఈ ట్రేడింగ్ మూసివేయబడుతుంది. పూర్తి సెలవు షెడ్యూల్ కోసం ఎన్ఎస్ఈ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ఇండియన్ స్టాక్ ఎక్స్ఛేంజీలు (BSE, NSE) 2025కి 14 ట్రేడింగ్ సెలవులను ప్రకటించాయి. ఫిబ్రవరి, మే, నవంబర్, డిసెంబర్‌లలో ఒక్కొక్కటి, మార్చి, ఆగస్టులలో రెండు సెలవులు ఉంటాయి. ఏప్రిల్, అక్టోబర్‌లలో ఒక్కొక్కటి మూడు సెలవులు ఉంటాయి. ఈ షెడ్యూల్ కొద్ది రోజుల క్రితమే విడుదలైంది. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే వారు తమ ట్రేడింగ్ రోజులను సరిగ్గా ప్లాన్ చేసుకోవడం, సెలవుల్లో మార్కెట్ పరిస్థితిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
2025 కోసం బీఎస్సీ, ఎన్ఎస్సీ సెలవుల జాబితా
26 ఫిబ్రవరి 2025 బుధవారం మహాశివరాత్రి
14 మార్చి 2025 శుక్రవారం హోలీ
31 మార్చి 2025 సోమవారం ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్ ఈద్)
10 ఏప్రిల్ 2025 గురువారం శ్రీ మహావీర్ జయంతి
14 ఏప్రిల్ 2025 సోమవారం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి
18 ఏప్రిల్ 2025 శుక్రవారం గుడ్ ఫ్రైడే
1 మే 2025, గురువారం మహారాష్ట్ర దినోత్సవం
15 ఆగస్టు 2025 శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవం
27 ఆగస్టు 2025 బుధవారం గణేష్ చతుర్థి
2 అక్టోబర్ 2025, గురువారం మహాత్మా గాంధీ జయంతి / దసరా
21 అక్టోబర్ 2025, మంగళవారం దీపావళి లక్ష్మీ పూజ
22 అక్టోబర్ 2025, బుధవారం దీపావళి బలిప్రతిపాద
5 నవంబర్ 2025, బుధవారం ప్రకాష్ గురు పర్వ్ శ్రీ గురునానక్ దేవ్
25 డిసెంబర్ 2025, గురువారం క్రిస్మస్
* ముహూరత్ ట్రేడింగ్ – ముహూరత్ ట్రేడింగ్ మంగళవారం, అక్టోబర్ 21, 2025
* 2025లో మొదటి స్టాక్ మార్కెట్ సెలవుదినం ఫిబ్రవరి 26 బుధవారం మహాశివరాత్రి రోజు.
* మార్చిలో రెండు సెలవులు ఉన్నాయి: మార్చి 14న (శుక్రవారం) హోలీ , మార్చి 31న (సోమవారం) ఈద్ అల్-ఫితర్ (రంజాన్ ఈద్).
* ఏప్రిల్‌లో మూడు సెలవులు ఉన్నాయి: శ్రీ మహావీర్ జయంతి ఏప్రిల్ 10 (గురువారం), బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 (సోమవారం), గుడ్ ఫ్రైడే ఏప్రిల్ 18 (శుక్రవారం).
* మహారాష్ట్ర దినోత్సవం మే 1వ తేదీన (గురువారం) ఉంటుంది. ఆగస్టులో, ఆగస్టు 15 (శుక్రవారం)న స్వాతంత్ర్య దినోత్సవం , ఆగస్టు 27న (బుధవారం) గణేష్ చతుర్థి ఉంటుంది.
* అక్టోబర్‌లో మూడు సెలవులు ఉన్నాయి: గాంధీ జయంతి, దసరా అక్టోబర్ 2 (గురువారం), దీపావళి అక్టోబర్ 21 (మంగళవారం), దీపావళి బలిప్రతిపాద అక్టోబర్ 22 (బుధవారం).
* ముహూర్త ట్రేడింగ్ మంగళవారం, అక్టోబర్ 21, 2025 నాడు జరుగుతుంది, సమయం తరువాత ప్రకటించబడుతుంది.
* గురునానక్ దేవ్ జయంతి సందర్భంగా నవంబర్ 5 (బుధవారం), క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25 (గురువారం) ట్రేడింగ్ మూసివేయబడుతుంది.
* కొన్ని సెలవులు వారాంతాల్లో కూడా ఉన్నాయి: గణతంత్ర దినోత్సవం (జనవరి 26), రామ నవమి (6 ఏప్రిల్), ముహర్రం (జులై 6) ఆదివారం, బక్రీద్ (జూన్ 7) శనివారం.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: How many days will the stock market be closed in the new year here is the complete list
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com