Case registered against TV5 Murthy: పాత్రికేయులు పాత్రికేయుల మాదిరిగా ఉండాలి.. అలాకాకుండా భార్యాభర్తల మధ్య వ్యవహారాలను మీడియాకు ఈడ్చి.. అందులో సొంత పైత్యాన్ని చేర్చి.. పెదరాయుడు లాగా తీర్పు ఇస్తే.. అటువంటి వ్యక్తులను మీడియా ప్రతినిధులు అనాలా? అటువంటివారు సత్యానికి, ధర్మానికి, న్యాయానికి ప్రతీకలుగా ఉంటారా.. అటువంటివారిని గొప్ప పాత్రికేయులు అని అనాలా.. ఇప్పుడు ఈ ప్రశ్నలు ఎందుకు వ్యక్తం చేస్తున్నామంటే.. జరిగిన సంఘటన అటువంటిది.. ఆ సంఘటనకు పాల్పడిన వ్యక్తి అటువంటివాడు..
తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా చరిత్రలో మూర్తికి ప్రత్యేక గుర్తింపు ఉంది… అనేక చానల్స్ లో పనిచేసిన తర్వాత ప్రస్తుతం ఆయన టీవీ5 ఛానల్ లో కీలక స్థానంలో కొనసాగుతున్నారు. ఏదైనా విషయం మీద మొహమాటం లేకుండా మాట్లాడటం.. ఉన్న విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా చెప్పడం ఆయన స్పెషాలిటీ. ఎన్నో గొప్ప ఇంటర్వ్యూలు చేసిన ఆయన ప్రస్తుతం కెరియర్లో మంచి స్థానంలో ఉన్నారు.. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన మీద అనేక కేసులు పెట్టింది. వాటిని ఆయన ధైర్యంగానే ఎదుర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఏపీలో అనుకూల ప్రభుత్వం ఉన్నప్పటికీ.. తెలంగాణలో సానుకూలంగా ఉన్న ప్రభుత్వం అధికారంలో కొనసాగుతున్నప్పటికీ మూర్తి మీద కేసులు నమోదు అయ్యాయి.
ఇటీవల కాలంలో గౌతమి చౌదరి అనే మహిళ.. తన భర్త నటుడు ధర్మసత్యసాయి మహేష్ మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది.. ఈ క్రమంలో వారిద్దరి వ్యవహారం మీడియాకు ఎక్కింది.. గౌతమికి అనుకూలంగా టీవీ5 మూర్తి వ్యవహరించడం మొదలుపెట్టారు. గౌతమి తల్లిదండ్రులను, గౌతమిని ఇంటర్వ్యూ కూడా చేశారు.. దీనిపై మహేష్ కూడా మీడియాకు ఎక్కారు. ఓ న్యూస్ ఛానల్ లో ఆయన కూడా ప్రైమ్ టైంలో మాట్లాడారు. టీవీ5 మూర్తి మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.. తన ప్రమేయం లేకుండా ఇంటికి వస్తున్నాడని.. తన భార్యతో వేరే విధమైన వ్యవహారాలు నడుపుతున్నాడని ఆరోపించాడు. అంతేకాదు తన ఫోన్ ట్యాప్ చేసి పది కోట్లు డిమాండ్ చేస్తున్నాడని కోర్టును ఆశ్రయించాడు. కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో తెలంగాణలోని కూకట్ పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. తన ఫోన్ ట్యాప్ చేసి తన వ్యక్తిగత విషయాలను టీవీ5 ఛానల్ లో ప్రసారం చేస్తున్నాడని మూర్తి మీద మహేష్ మండిపడ్డాడు. అంతే కాదు పది కోట్ల దాకా డిమాండ్ చేస్తున్నాడని అతని కోర్టును ఆశ్రయించాడు.
మహేష్ ఏపీలోని మాజీ మంత్రి కాకాని వెంకటేశ్వరరావు కుమారుడు.. మహేష్ తో విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో టీవీ5 మూర్తితో కలిసి గౌతమి చౌదరి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం విశేషం. కోర్టు ఆదేశాల నేపథ్యంలో గౌతమి చౌదరిని ఏ1, మూర్తిని ఏ 2 గా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మూర్తి గౌతమి చౌదరి వ్యవహారాన్ని చాలా రోజులపాటు టీవీ 5 ఛానల్ ప్రసారం చేశాడు. దీనిపై కాకాని వెంకటేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇలా వీరిద్దరి మధ్య సాగిన వివాదం చివరికి పోలీస్ స్టేషన్ దాకా వచ్చింది.. మరి దీనిపై మూర్తి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
TV5 మూర్తిపై కేసు నమోదు చేసిన కూకట్పల్లి పోలీసులు
తన ఫోన్ ట్యాప్ చేసి రూ.10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని కోర్టును ఆశ్రయించిన నటుడు ధర్మ సత్యసాయి మహేష్
కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసిన పోలీసులు
హైదరాబాద్ – TV5 మూర్తి తన ఫోన్ ట్యాప్ చేసి, తన వ్యక్తిగత వివరాలు టెలికాస్ట్… pic.twitter.com/t065SiIBHQ
— Telugu Scribe (@TeluguScribe) November 5, 2025