https://oktelugu.com/

Water In Petrol : ఇంత మోసమా.. బంకులో పెట్రోల్ బదులు నీళ్లు..

పెట్రోల్ బంకులో పెట్రోల్ కు బదులుగా నీరు రావడంతో కస్టమర్లు బంకు సిబ్బందిపై దాడి చేశారు. తెలంగాణలోని మంచిర్యాలలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

Written By: NARESH, Updated On : July 31, 2023 8:26 pm
Follow us on

Water In Petrol : కాదేది కల్తీకి అనర్హం అన్నట్టుగా దేశంలో పరిస్థితులున్నాయి. అగ్గిపుల్ల, సబ్బు బిల్ల.. వంట నూనెలు సహా దేశంలో అంతా కల్తీనే.. పాలు కల్తీ.. నీళ్లు కూడా కల్తీ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడో విదేశాల నుంచి వచ్చే పెట్రోల్ ను కూడా కల్తీ చేసి పడేశారు ప్రబుద్దులు..

ఇప్పటికే ధరాభారంతో మొత్తుకుంటున్న సామాన్యుడికి కూరగాయలు షాకిస్తుండగా.. పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. లీటర్ పెట్రోల్ 110 దాటడంతో చిన్నా చితక ఉద్యోగాలు చేసుకునే వారం సంపాదన అంతా పెట్రోల్ ఖర్చులకే పోతోంది.

ఇక ఇదే అదునుగా పెట్రోల్ బంకుల యజమానులు కూడా అక్రమాలకు తెరలేపుతున్నారు. కాసులకి కకృత్తి పడి పెట్రోల్ కు బదులు నీళ్లు కొట్టిన వైనం తాజాగా వెలుగుచూసింది. దీంతో కోపోద్రిక్తులైన వాహనదారులు సిబ్బందికి బడిత పూజ చేసి తగిన శాస్తి చేశారు.

వాహనదారులు ఇలాంటి బంకుల విషయంలో జర జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. పెట్రోల్ బంక్ నిర్వాహకులు పెట్రోల్ బదులు నీళ్లు పోస్తున్నారు.. మీరు చూసుకోకపోతే మీ వాహనం మాటాష్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

పెట్రోల్ బంకులో పెట్రోల్ కు బదులుగా నీరు రావడంతో కస్టమర్లు బంకు సిబ్బందిపై దాడి చేశారు. తెలంగాణలోని మంచిర్యాలలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

మంచిర్యాల పట్టణంలోని హైటెక్ సిటీలో ఉన్న హిందూస్తాన్ పెట్రోలియం బంకులో పెట్రోల్ కు బదులుగా నీరు వస్తుండటంతో కస్టమర్లు బంకు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అనంతరం సిబ్బందిపై దాడి చేశారు. దీంతో యజమాన్యం బంకును మూసివేసింది. పోలీసులు కి సమాచారం అందించారు. ప్రస్తుతం బంకులో నీళ్లు ఎలా వచ్చాయన్నదానిపై అధికారులు విచారణ జరుపుతున్నారు.