spot_img
HomeతెలంగాణPetrol Shortage: పెట్రోల్ , డీజిల్ నో స్టాక్.. మధ్యలో ఈ పానిక్ బయింగ్ ఏంటి...

Petrol Shortage: పెట్రోల్ , డీజిల్ నో స్టాక్.. మధ్యలో ఈ పానిక్ బయింగ్ ఏంటి భయ్యా.. భయపెడుతున్నారు కదరా..

Petrol Shortage: సప్లై తక్కువగా ఉన్నప్పుడు.. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు రద్దీ పెరుగుతూ ఉంటుంది. ఒక వస్తువు అవసరాన్ని తగ్గట్టుగా సరఫరా అయితే పెద్దగా ఇబ్బంది ఉండదు. అలా కాకుండా అవసరం పెరిగిపోయి.. సరఫరా తగ్గిపోతే అప్పుడు ఇబ్బంది కరమైన వాతావరణ ఏర్పడుతూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ ఒత్తిడి వల్ల సరఫరా వ్యవస్థ మొత్తం స్తంభించిపోతుంది.

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంధన సరఫరా కూడా ఇదేవిధంగా ఉంది. బంకులలో పెట్రోల్ లేదు. డీజిల్ స్టాక్ కూడా లేదు. దీంతో బంకులు యజమానులు నో స్టాక్ బోర్డు పెట్టేశారు. ఫలితంగా వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ నుంచి మొదలు పెడితే విజయవాడ వరకు పరిస్థితి ఇలానే ఉంది. చాలా వరకు బంక్ నిర్వాహకులు నో స్టాక్ బోర్డు పెట్టేశారు. ఫలితంగా వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

ఇటీవల కాలంలో హైదరాబాదులో ఇలానే అనేక పెట్రోల్ బంకులలో డీజిల్ లభించలేదు. పెట్రోల్ కూడా అందుబాటులో లేదు. దీంతో చాలావరకు వాహనదారులు నరకం చేశారు. ఇంధనం కోసం బారులు తీరారు.. ఏపీలో ఈ పరిస్థితి ఉండడంతో ప్రభుత్వ రంగంలోకి దిగింది. అధికారులను అప్రమత్తం చేసింది.

ఓవైపు చమురు కొరత వల్ల వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇదే అదునుగా మరికొంతమంది రెచ్చిపోతున్నారు. ఏకంగా పానిక్ బయింగ్ విధానానికి పాల్పడుతున్నారు. తమ వాహనాలనే కాకుండా.. క్యాన్లలో ఇంధనం పట్టుకుని తీసుకెళ్లారు. ప్రభుత్వం రంగంలోకి దిగడంతో ఆ తర్వాత చమురు అందుబాటులోకి వచ్చింది.

అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఇప్పుడు డీజిల్ కొరత వేధిస్తోంది. ప్రస్తుతం వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయి. వరి కోతలు.. గడ్డి కట్టడం వంటి పనులు ముంబరంగా ఉన్నాయి. ఒకప్పుడు ఈ పనులను మనుషులు చేసేవారు. ఇప్పుడు యంత్రాలు చేస్తున్నాయి. యంత్రాలు పని చేయాలంటే కచ్చితంగా డీజిల్ ఉండాలి. డీజిల్ కొరత నేపథ్యంలో వరి కోతలు ఆగిపోయాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో వరి కోతకు వచ్చింది. ఇటీవల కాలంలో వర్షాలు పడిన నేపథ్యంలో.. తమ పంటలను కాపాడుకోవడం రైతులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోని డీజిల్ అయిపోవడంతో వ్యవసాయ పనులు నిలిచిపోయాయి.

జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం పరిశ్రమలకు భారీగా సరఫరా చేసే డీజిల్ ధర పెరిగింది. దీంతో పరిశ్రమ నిర్వాహకులు డీజిల్ కోసం ఇతర పెట్రోల్ బంకులను ఆశ్రయించడం మొదలుపెట్టారు. దీనికి తోడు ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ఆప్షన్ ఇవ్వడం లేదు. అందువల్ల డీజిల్, పెట్రోల్ లభించడం లేదు. కొన్నిచోట్ల డీజిల్ ,పెట్రోల్ లభిస్తున్నప్పటికీ చాలామంది ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దీనిని సైంటిఫిక్ భాషలో పానిక్ బయింగ్ అంటారు. దీనివల్ల మిగతా వారికి డీజిల్, పెట్రోల్ దొరకదు. అందువల్లే పానిక్ బయింగ్ కు పాల్పడవద్దని అధికారులు వినియోగదారులకు సూచిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version