https://oktelugu.com/

Halim : హలీం ఉచితం అనగానే ఎగబడ్డారు.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్..

హోటల్ యాజమాన్యంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఉచితంగా ప్రచారం కోసం ఇలాంటి ప్రకటనలు ఎందుకు చేయాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా పోలీసులు కొట్టాల్సింది హోటల్ యజమానినని.. అతడి నిర్వాకం వల్లే సామాన్య ప్రజలు లాఠీ దెబ్బలు తిన్నారని అంటున్నారు. ఇలాంటి ఆఫర్లు భవిష్యత్తులో ప్రకటించకుండా ఆ హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, రద్దీని తట్టుకోలేక నిర్వాహకులు హోటల్ ను కొంతసేపు వరకు మూసి వేసినట్టు ప్రచారం జరుగుతోంది.

Written By:
  • NARESH
  • , Updated On : March 13, 2024 / 01:10 PM IST
    Follow us on

    Halim : రంజాన్ మాసం ప్రారంభం కావడంతో హలీం సందడి మొదలవుతుంది. ముఖ్యంగా హైదరాబాదులో ప్రతి వీధిలో హలీం సెంటర్లు వెలుస్తాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాస దీక్ష చేసిన ముస్లింలు, ఇతరులు హలీం తినడానికి ఇష్టపడుతుంటారు. దీంతో హలీం దుకాణాలు సందడిగా ఉంటాయి. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు జనంతో కిటకిటలాడుతుంటాయి. ప్రస్తుతం రంజాన్ మాసం ప్రారంభం కావడంతో హలీం సెంటర్లు మొదలయ్యాయి. ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు, ఉపవాస దీక్షలు చేస్తున్నారు.

    ఈ క్రమంలో మలక్ పేట సమీపంలోని మూసారంబాగ్ లో హాజీబో హోటల్ యాజమాన్యం బంపర్ ఆఫర్ ప్రకటించింది. రంజాన్ సందర్భంగా ఉచితంగా హలీం ఇస్తామని సోషల్ మీడియాలో ప్రకటన చేసింది. దీంతో ఆ హోటల్ కు భారీగా ప్రజల వచ్చారు. దీంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. దీంతోపాటు ఆ హోటల్ పరిసర ప్రాంతాల్లో విపరీతమైన ట్రాఫిక్ జామ్ అయింది. ఫలితంగా వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో వచ్చిన జనాలను నియంత్రించడం హోటల్ యాజమాన్యానికి వీలుపడలేదు. ఫలితంగా పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు రంగంలోకి దిగినప్పటికీ జనాలను నియంత్రించడం వారి వల్ల కాలేదు. పైగా హలీం కోసం జనం అంతకంతకు ఎగబడుతుండడంతో పోలీసులకు తల ప్రాణం తోక కొచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. చాలామందిని కొట్టి రద్దీ
    తగ్గించారు.