https://oktelugu.com/

TG Registration : ఇక TS ఉండదు.. తెలంగాణ రిజిస్ట్రేషన్ మార్పు.. ఎవరూ దీనిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే?

ప్రస్తుతం ఉన్న వాహనదారులు తమ రిజిస్ట్రేషన్ ను మార్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. అయితే కొత్త వాహనాలు కొనేవారు మాత్రం తప్పనిసరిగా టీజీ తోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అన్నారు.

Written By: , Updated On : March 13, 2024 / 01:14 PM IST
Ts to TG Gezit Relese

Ts to TG Gezit Relese

Follow us on

TG Registration :పదేళ్ల కిందట ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత కొత్త రాష్ట్రానికి అనుగుణంగా పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు బోర్డులు, లోగోలు మారిపోయాయి. ఇదే సమయంలో వాహనాల రిజిస్ట్రేషన్ విషయంలో కూడా అప్పటి వరకు ఉన్న ఏపీ రిజిస్ట్రేషన్ నుంచి టీఎస్ గా మార్చారు. అయితే 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు ప్రజల డిమాండ్ మేరకు మరోసారి మార్పులు అవసరం అని భావిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి బృందం తెలిపింది. ఈ మేరకు ఇప్పటి వరకు వాహనాల ఉన్న వాహనాల రిజిస్ట్రేషన్ ను టీఎస్ నుంచి టీజీకి మార్చాలని నిర్ణయించారు. దీనిపై ఇప్పటికే కేబినేట్ ఆమోదం తెలిపింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం టీఎస్ నంచి టీజీగా మారుస్తూ గెజిట్ ను విడుదల చేసింది.

కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రిత్వ శాఖ నుంచి మంగళవారం ఈ గెజిట్ విడుదల అయింది. దీని ప్రకారం మోటారు వాహనాల చట్టం 1988 సెక్షన్ 41(6)కింద ఉన్న అధికారాలను ఉపయోగించి 1989,12 నాటి ఉపరితల రవాణాశాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో మార్పులు చేసింది. ఇందులో భాగంగా గత నోటిఫికేషన్లో ని టేబుల్లో సీరియల్ నెంబర్ 29ఏ కింద తెలంగాణ రాష్ట్రానికి ఇదివరకు ఉన్న టీఎస్ స్థానంలో టీజీ మారుస్తున్నట్లు గెజిట్ లో పేర్కొంది.

అయితే టీఎస్ నుంచి టీజీగా మారిన నేపథ్యంలో తెలంగాణ లోని వాహనదారుల్లో అయోమయం నెలకొంది. ఇప్పుడున్న వాహనాలను తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? అనే సందేహాలు ఉన్నాయి. అయితే దీనిపై గెజిట్ లో స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న వాహనదారులు తమ రిజిస్ట్రేషన్ ను మార్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. అయితే కొత్త వాహనాలు కొనేవారు మాత్రం తప్పనిసరిగా టీజీ తోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అన్నారు. అంతేకాకుండా ఏపీ రిజిస్ట్రేషన్ ను మార్చాల్సిన అవసరం లేదన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రిజిస్ట్రేషన్ టీజీ ఉండాలని ప్రజలు కోరుకున్నారని ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి పలు సమావేశాల్లో పేర్కొన్నారు. అయితే కొందరు మేదావులు టీజీ ఉండాని కోరినా గత ప్రభుత్వం టీఎస్ గా మార్చారని, అందువల్ల టీజీగా మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర మంత్రి వర్గంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు తాజాగా కేంద్ర ప్రభుత్వం టీఎస్ నుంచి టీజీగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.