Director: టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో సుకుమార్ ఒకరని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ నటించిన ‘ఆర్య’ సినిమాతో దర్శకుడిగా ఎంటర్ అయిన సుకుమార్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. మొదటి సినిమాతోనే తన ప్రత్యేకతను నిరూపించుకున్నారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఆ తరువాత జగడం, ఆర్య-2, 100 పర్సెంట్ లవ్, వన్ (నేనొక్కడినే), నాన్నకు ప్రేమతో వంటి చిత్రాలతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు.
రామ్ చరణ్(Ram Charan) నటించిన రంగ స్థలం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా.. ఆ తరువాత వచ్చిన పుష్ప సినిమాతో సుకుమార్ పాన్ ఇండియా హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం పుష్ప -2 సినిమాతో ఆయన బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. అయితే సుకుమార్ వ్యక్తిగతంగా ఎంతో మంది చేయూత ఇచ్చారని తెలుస్తోంది..ఈ క్రమంలోనే ఓ సాధారణ తాపీ పని చేసుకునే వ్యక్తికి భరోసా ఇచ్చి కాంట్రాక్టర్ గా ఎదిగేలా చేశారట. ఇప్పుడు ఆ విషయాలను మనం తెలుసుకుందాం.
సుకుమార్ విరామ సమయంలో మలికాపురం మండలంలోని మట్టపర్రుకు ( స్వగ్రామం ) వెళ్లిన ప్రతి సారి అందరీతో ఎంతో కలివిడిగా మాట్లాడతారట. ఊరిలోని స్నేహితులకు అండగా నిలుస్తారని అక్కడి వాసులు చెబుతున్నారు. కరోనా వంటి క్లిష్ట సమయాల్లోనూ గ్రామ ప్రజలకు సుకుమార్ అండగా నిలిచారు. అనారోగ్యంతో ఉన్న, శుభకార్యాలు అయినా అందరికీ తన వంతు సాయం చేస్తారని గ్రామ ప్రజలు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే గ్రామంలో ఉన్న స్నేహితులతో సుకుమార్ సమయాన్ని ఎక్కువగా గడుపుతారు. అంతేకాదు వారు జీవితంలో రాణించాలని కోరుకోవడంతో పాటు ఆ దిశగా వెళ్లేందుకు వారికి ఎంతో సాయం చేస్తారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే తాపీ పని చేసుకునే తన స్నేహితుడికి స్కూల్ భవనం నిర్మించే కాంట్రాక్ట్ ను సుకుమార్ ఇప్పించారు. ఈ విధంగా ఎంతో మందికి ఏదో ఒక సాయం చేస్తూ సుకుమార్ ప్రజల మనసులో మరింత స్థానాన్ని సంపాదించుకున్నారు.