Ustaad Bhagat Singh: ఓజీ సక్సెస్ తో మంచి ఫామ్ లోకి వచ్చిన పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh Movie) చిత్రం కోసం సరికొత్త ఎనర్జీ తో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో ప్రేక్షకుల్లో ప్రస్తుతానికి అయితే భారీ అంచనాలు లేవు. ఎందుకంటే ఇది కేవలం ఒక రొటీన్ కమర్షియల్ మాస్ సినిమా కాబట్టి, కానీ ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ ని ఆకట్టుకునే రేంజ్ లో ఉంటే మాత్రం హైప్ భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే రేపు ఈ చిత్రం నుండి మొదటి లిరికల్ వీడియో సాంగ్ విడుదల కాబోతుంది. ఈ పాటకు సంబంధించిన ప్రోమో ని రీసెంట్ గానే విడుదల చేయగా, దానికి ఫ్యాన్స్ నుండి ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూసాము. పవన్ కళ్యాణ్ నుండి ఈ రేంజ్ డ్యాన్స్ స్టెప్పులు చూసి చాలా కాలం అయ్యింది అంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
పూర్తి పాటలో పవన్ కళ్యాణ్ స్టెప్పులు వేరే లెవెల్ లో ఉన్నాయని, అసలు ఆయన నుండి ఇలాంటి స్టెప్పులు ఎవ్వరూ ఊహించి ఉండరని అంటున్నారు . రేపు రాజమండ్రి లోని సురపురం లో ఉన్నటువంటి ఆదిత్య యూనివర్సిటీ లో ఒక గ్రాండ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసి ఈ పాటని విడుదల చేయబోతున్నారు. సాయంత్రం 5 గంటల నుండి ఈ ఈవెంట్ మొదలు కాబోతుంది. ఆన్లైన్ లోకి ఈ పాట సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు అందుబాటులోకి రానుంది. అంత బాగానే ఉంది కానీ, ప్రోమో చూసిన తర్వాత దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఎందుకో రొటీన్ గా, అవుట్ డేటెడ్ గా అనిపించింది. కానీ పవన్ కళ్యాణ్ డ్యాన్స్ వేసిన వీడియో కాబట్టి క్లిక్ అవ్వొచ్చు అని అంటున్నారు విశ్లేషకులు. ఈమధ్య కాలం లో ఒక సినిమాపై ఆడియన్స్ లో పాజిటివ్ అభిప్రాయం కలగాలంటే, పాటలు సూపర్ హిట్ అవ్వాలి.
పాటలు సూపర్ హిట్ అయ్యి , ఇన్ స్టాగ్రామ్ మరియు ఇతర మ్యూజిక్ ప్లాట్ ఫార్మ్స్ లో వైరల్ అయితే, ఇక ఆకాశమే హద్దు అనే రేంజ్ లో ఓపెనింగ్ వసూళ్లు వస్తాయి. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పాటలు హిట్ అయితే ఓజీ రికార్డ్స్ ని కూడా బద్దలు కొట్టొచ్చు. ఇకపోతే ఈ చిత్రాన్ని మార్చి 26 న కానీ, లేదా ఏప్రిల్ రెండవ వారం లో కానీ విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. రామ్ చరణ్ పెద్ది చిత్రం ఒకవేళ మార్చి 26 న విడుదల అవ్వకపోతే, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఆ తేదీన విడుదల చేస్తారని అంటున్నారు. మరి ఇందులో ఏది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి. ఇకపోతే రేపు ఈ పాట విడుదల సందర్భంగా డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ పాట ఫైనల్ ఔట్పుట్ ని పవన్ కళ్యాణ్ కి చూపించగా, ఆయన ఆ పాటని చూసి ఒక రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. అందుకు స్సంబంధించిన వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
Our Power Star @PawanKalyan started humming #DekhlengeSaala after watching the final song
The Telugu audience will be humming the same from 6.30 PM tomorrow
Cult Captain @harish2you‘s Feast
A Rockstar @ThisisDsp Musical ❤️
Sung by… pic.twitter.com/FovadUVhJk— Mythri Movie Makers (@MythriOfficial) December 12, 2025