Telangana Movie Ticket Price: మన టాలీవుడ్ కి అత్యధిక కలెక్షన్స్ ని ఇచ్చే సెంటర్స్ లో ఒకటి నైజాం. దాదాపుగా 40 శాతం వసూళ్లు ఇక్కడి నుండే వస్తాయి. ఒకప్పుడు ఈ ప్రాంతం లో బాలీవుడ్ హీరోల డామినేషన్ ఉండేది. అమితాబ్ బచ్చన్ సినిమాలు ఆరోజుల్లో మన టాలీవుడ్ హీరోల సినిమాలకంటే ఎక్కువ రోజులు ఆడేవి. ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెబల్ స్టార్ ప్రభాస్ వంటి వారు ఇక్కడ బలమైన మార్కెట్ ని సంపాదించుకొని తిరుగులేని సూపర్ స్టార్స్ గా కొనసాగారు. ఇప్పుడు ఈ మార్కెట్ రేంజ్ ఏంటంటే, ఒక సూపర్ స్టార్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ కి 100 కోట్ల రూపాయిల రేంజ్ లో షేర్ వసూళ్లు వస్తాయి. ఈ రేంజ్ మార్కెట్ త్వరలో పడిపోబోతుందా? అంటే అవుననే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
ఎందుకంటే తెలంగాణ లో టికెట్ రేట్స్, ప్రీమియర్ షోస్ వేసుకోవడానికి ప్రభుత్వం అనుమతించిన, హై కోర్టు ససేమీరా నో చెప్తోంది. ఓజీ చిత్రానికి ప్రీమియర్ షోస్, టికెట్ హైక్స్ పెంచుకోవడానికి అనుమతించిన ప్రభుత్వాన్ని తప్పుబడుతూ జీవో వెనక్కి తీసుకోవాలని హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక మీదట పెద్ద సినిమాలకు టికెట్ హైక్స్ రావడం దాదాపుగా కష్టమే అని అనుకుంటున్న సమయంలో రీసెంట్ గా విడుదలైన ‘అఖండ 2’ కి కూడా టికెట్ హైక్స్, ప్రీమియర్ షోస్ కి అనుమతిని ఇచ్చారు. దీనిపైనా కూడా తప్పుబట్టిన హై కోర్టు ప్రభుత్వాన్ని జీవో ని ఉపసంహరించుకోవాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటి రెడ్డి మాట్లాడుతూ ‘నాకు తెలియకుండానే ఈమధ్య కాలం లో టికెట్ హైక్స్ కి సంబంధించిన జీవోలు పాస్ అవుతున్నాయి. ఇక మీదట నిర్మాతలు , దర్శకులు టికెట్ హైక్స్, ప్రీమియర్ షోస్ కోసం నా వద్దకు రావొద్దు’ అంటూ చెప్పుకొచ్చాడు.
అదే కనుక జరిగితే టాలీవుడ్ ఇండస్ట్రీ కి పెద్ద నష్టం వాటిల్లుతుంది అనే చెప్పొచ్చు. టికెట్ హైక్స్ + ప్రీమియర్ షోస్ వల్లే ఇప్పుడు నైజాం ప్రాంతం లో పవన్ కళ్యాణ్ , ప్రభాస్ వంటి సూపర్ స్టార్స్ కి మొదటి రోజే 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వస్తున్నాయి. ఒకవేళ ఇప్పుడు హైక్స్, ప్రీమియర్ షోస్ లకు అనుమతిని ఇవ్వకపోతే, ఇక నుండి మొదటి రోజు పెద్ద చిత్రాలకు పది కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రావడం కూడా గగనమే అయిపోతుంది. ఆ రేంజ్ ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం సినీ ఇండస్ట్రీ కి స్నేహపూర్వకంగానే వ్యవహరిస్తోంది కాబట్టి, ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం ఇస్తారో చూడాలి.