spot_img
Homeటాప్ స్టోరీస్Hyderabad Outer Ring Road Accidents: ఓఆర్ఆర్ పై ప్రయాణిస్తున్నారా.. ప్రజా ప్రతినిధులారా తస్మాత్...

Hyderabad Outer Ring Road Accidents: ఓఆర్ఆర్ పై ప్రయాణిస్తున్నారా.. ప్రజా ప్రతినిధులారా తస్మాత్ జాగ్రత్త!

Hyderabad Outer Ring Road Accidents: విశాలమైన రోడ్డు.. ఏమాత్రం గతుకులు ఉండవు. వేగంగా దూసుకుపోవచ్చు. ధ్వని వేగంతో సమానంగా వాహనాన్ని నడపవచ్చు. అందువల్లే చాలామంది బాహ్య వలయ రహదారి మీద ప్రయాణించడాన్ని ఆనందిస్తుంటారు. ఔటర్ కేవలం రోడ్డు మాదిరిగానే కాకుండా.. చుట్టూ వృక్షాలు.. పూల మొక్కలతో కనువిందు చేస్తూ ఉంటుంది. అందువల్లే ఆ ప్రకృతిని చూస్తూ చాలామంది వేగంతో వెళ్తూ ఉంటారు.

Also Read: మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత.. ఇంత దారుణమా.. అసలు వాళ్ళు ఏమైపోవాలి?

ఔటర్ రింగ్ రోడ్డు మీద స్పీడోమీటర్లు ఉన్నప్పటికీ చాలామంది వేగాన్ని ఆస్వాదిస్తూ ముందుకు వెళ్తుంటారు. అందువల్ల ట్రాఫిక్ చలాన్లకు గురవుతూ ఉంటారు. ఆ మధ్య మహేష్ బాబు ప్రయాణిస్తున్న కారు మితిమీరిన వేగంతో వెళ్లడంతో.. చలాన్ నమోదయింది. దీనిని బట్టి ఔటర్ రింగ్ రోడ్డు మీద సెలబ్రిటీలు.. ప్రజా ప్రతినిధులు ఏ స్థాయిలో ప్రయాణం సాగిస్తుంటారో అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్సీ అజహారుద్దీన్ కుమారుడు తన విలాసవంతమైన బైక్ మీద అవుటర్ రింగ్ రోడ్డు మీద ప్రయాణించాడు. మితిమీరిన వేగంతో ప్రయాణించడంతో ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో అతడు దుర్మరణం చెందాడు. అప్పట్లో సినీ హీరో రాజశేఖర్ కారు కూడా ప్రమాదానికి గురైంది. దాని కారణం కూడా మితిమీరిన వేగమని తెలుస్తోంది. కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఎమ్మెల్యేగా ఉన్న ఆమె ప్రయాణిస్తున్న కారు మితిమీరిన వేగంతో వెళ్లడంతో.. ప్రమాదం జరిగింది. అప్రమాదంలో లాస్య నందిత చనిపోయింది.

ఇప్పుడు దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుమార్తెలు ఔటర్ రింగ్ రోడ్డు మీద ప్రయాణిస్తుండగా.. వారి వాహనం ప్రమాదానికి గురైంది. ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టడంతో వారి ప్రయాణిస్తున్న కారు ధ్వంసం అయింది. మాగంటి గోపీనాథ్ ఇద్దరు కుమార్తెల్లో పెద్ద కుమార్తె అక్షర తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె అత్యంత విషమ పరిస్థితిని ఎదుర్కొంటున్నది. గచ్చిబౌలి లోని ఏఐజి ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.. ఔటర్ రింగ్ రోడ్డు మీద ప్రజాప్రతినిధులు ఇలా వరుసగా గాయపడడం లేదా మృతి చెందడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్న తీరు దిగ్భ్రాంతి కలిగిస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper