Warangal Mamnoor Airport
Warangal Mamnoor Airport: తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండో ఎయిర్‌పోర్టు(Airport) రాబోతోంది. వరంగల్‌లో ఎయిర్ పోర్టు నిర్మాణానికి పదేళ్లుగా జరుగుతున్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. ఈమేకు కేంద్రం పచ్చజెండా ఊపింది.
Also Read: మాజీ డిజిపికి అరుదైన చాన్స్.. ఎంతో నమ్మకంతో రెండు పదవులు ఇచ్చిన చంద్రబాబు!*
తెలంగాణలో వరంగల్(Warangal)లోని మామునూర్‌లో రెండవ విమానాశ్రయానికి కేంద్రం ఆమోదం తెలిపింది. పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు దాని ప్రాంతీయ సామర్థ్యాన్ని నొక్కి చెప్పారు. భూమి సేకరణ కోసం రాష్ట్రం రూ. 205 కోట్లు కేటాయించింది. GMR పరిమితిని అధిగమించి, ఈ ప్రాజెక్ట్ వాణిజ్యం, పర్యాటకం మరియు ఉపాధి అవకాశాలను పెంచుతుంది. ఈ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)కి అధికారిక లేఖ జారీ చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం 696.14 ఎకరాలు..
ప్రస్తుతం మామునూరు ఎయిర్‌పోర్ట్ వద్ద AAIపరిధిలో 696.14 ఎకరాల భూమి ఉంది. అదనంగా, విస్తరణ కోసం 253 ఎకరాల భూసేకరణకు తెలంగాణ ప్రభుత్వం రూ.205 కోట్లు విడుదల చేస్తూ గతంలో జీవో జారీ చేసింది. ఈ నిర్ణయం వరంగల్‌ను టెక్స్‌టైల్, ఫార్మా, ఐటీ హబ్‌గా అభివృద్ధి చేయడంతోపాటు, లక్నవరం, రామప్ప, సమ్మక్క–సారలమ్మ జాతర వంటి పర్యాటక ప్రాంతాల వద్ధికి దోహదపడనుంది. ఈ ప్రాజెక్టు వెనుక గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2023 జూలైలో కేబినెట్ సిఫార్సులు చేయడం, భూమి కేటాయింపు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అయితే, హైదరాబాద్‌కు 150 కి.మీ. దూరంలో మరో ఎయిర్‌పోర్ట్ నిర్మాణంపై GMRతో ఉన్న ఒప్పందం కారణంగా కొంత ఆలస్యం జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చర్చల తర్వాత ఈ ప్రాజెక్టుకు ముందడుగు పడినట్లు సమాచారం. ఈ అనుమతితో వరంగల్ విమానాశ్రయ నిర్మాణం వేగవంతం కానుంది, అయితే పూర్తి నిర్మాణ ప్రణాళిక మరియు పనుల షెడ్యూల్ గురించి ఇంకా అధికారిక వివరాలు వెల్లడి కాలేదు.