https://oktelugu.com/

Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డులపై కొత్త అప్డేట్

తెలంగాణ వ్యాప్తంగా 89,98,546 రేషన్‌(ఆహార భద్రత) కార్డులు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో రేషన్‌ కార్డు ఒక చిన్న పుస్తకం రూపంలో ఉండేది. అందులో కుటుంబ యజమాని ఫొటోతోపాటు కుటుంబ సభ్యుల పేర్లు, వయసు వివరాలు ఉండేవి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 22, 2024 / 11:14 AM IST

    Ration Cards

    Follow us on

    Ration Cards: తెలంగాణలో రేషన్‌ కార్డులను సరికొత్త రూపంలో పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ప్రస్తుతం ఉన్న కార్డుల రూపం మారబోతోంది. సరికొత్త కార్డులు జారీ చేసేందుకు కసరత్తు మొదలు పెట్టింది. ఎన్నికల కోడ్‌ ముగియగానే కొత్తవి జారీ చేసే ప్రక్రియ మొదలు పెట్టే అవకాశం ఉంది. ఆరోగ్యశ్రీ కార్డులు కూడా కొత్తవి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిన నేపథ్యంలో పాత కార్డుల స్థానంలో కొత్తవి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది.

    రాష్ట్రవ్యాప్తంగా 89,98,546 కార్డులు..
    తెలంగాణ వ్యాప్తంగా 89,98,546 రేషన్‌(ఆహార భద్రత) కార్డులు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో రేషన్‌ కార్డు ఒక చిన్న పుస్తకం రూపంలో ఉండేది. అందులో కుటుంబ యజమాని ఫొటోతోపాటు కుటుంబ సభ్యుల పేర్లు, వయసు వివరాలు ఉండేవి. ఆ తర్వాత వాటి స్థానంలో రైతుబంధు పాస్‌బుక్‌ సైజులో రేషన్‌ కార్డులు జారీ అయ్యాయి. ముందువైపు కుటుంబ సభ్యులు గ్రూప్‌ ఫొటో, కింద కుటుంబ సభ్యుల వివరాలు, వెనుక చిరునామా, ఇతర వివరాలు ఉండేవి. తర్వాత ఆహార భద్రత కార్డులు వచ్చాయి. ఒక పేజీతో ఒకవైపే అన్ని వివరాలు ఉండేలా రూపొందించారు. ఇందులో యజమాని, కుటుంబ సభ్యుల ఫొటో లేకుండా కార్డుదారు, కుటుంబ సభ్యులు, రేషన్‌ దుకాణం, కార్డు సంఖ్య మాత్రమే ఉన్నాయి.

    కొత్త కార్డు రూపకల్పనపై చర్చ..
    ప్రస్తుతం ఉన్న ఆహారభద్రత కార్డు స్థానంలో కొత్తవి జారీ చేయనున్న నేపథ్యంలో కార్డు ఎలా ఉండాలో మోడల్‌ రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. కార్డుపై తెలంగాణ లోగోతోపాటు సీఎం ఫొటో, కుటుంబ సభ్యులు ఫొటో, వివరాలు ఉండేలా రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వేలిముద్రల సేకరణ పూర్తయిన నేపథ్యంలో వేలిముద్రలు వేయనివారిని తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల గ్రూప్‌ ఫొటో కార్డుపై ముద్రించే అవకాశం ఉంది.