Kothagudem District : పగిడేరు ప్రాంతం గోదావరికి పరివాహకంగా ఉంటుంది. పగిడేరు ప్రాంతానికి దగ్గరలో బొగ్గు గనులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో నుంచి బయటికి వచ్చే వేడి నీరు ఉష్ణం 81 డిగ్రీలు.. భూమి నుంచి బయటికి వచ్చే వేడి నీరు ఉష్ణం 180 నుంచి 200 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక్కడి వేడి నీరును ప్రజలు తాగడానికి మినహా మిగతా అన్ని అవసరాలకు వాడుకుంటారు. సాగు పొలాలకు.. ఇతర అవసరాలకు ఈ నీటిని వాడుకుంటారు. ఇక్కడ వచ్చే వేడి నీటిని పరిశీలించడానికి దేశ విదేశాల నుంచి శాస్త్రవేత్తలు వస్తున్నారు. ఈ నీటిని పరిశీలించడం.. ఆ తర్వాత వెళ్లిపోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇక్కడ పలు ప్రాంతాలలో రైతులు బోర్లు వేశారు. సింగరేణి అధికారులు కూడా బొగ్గు గురించి పరిశోధన చేయడానికి బోర్లు వేశారు. అయితే ఆ బోర్ల నుంచి నీరు అదేపనిగా వస్తోంది. 30 ఫీట్ల లోతు లోనే నీరు పడటం విశేషం.. ఆ తర్వాత నీరు మరింత సమృద్ధిగా పడటం గమనార్హం.
ఎందుకిలా?
పగిడేరు చుట్టుపక్కల ప్రాంతాల్లో సింగరేణి బొగ్గు గనులు ఉన్నాయి. గోదావరి నది కూడా ప్రవహిస్తోంది. గోదావరి నది, బొగ్గు గరుడ వల్ల భూమి పొరల్లో చోటు చేసుకున్న రసాయనిక మార్పుల వల్ల నీరు వేడిగా మారుతున్నదని శాస్త్రవేత్తలు అంటున్నారు. మనదేశంలో ఇలా వేడి నీరు వచ్చే ప్రాంతాలు చాలా ఉన్నప్పటికీ.. పగిడేరు పూర్తి విభిన్నమైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ” ఇక్కడి నీరు వేడిగా ఉంటున్నది. నీరు లో పొగలు వస్తున్నాయి. ఈ నీరు తాగడానికి పనికిరాదు. పంట పొలాలకు, ఇతర అవసరాలకు మాత్రమే పనికి వస్తుంది. ఇక్కడి ప్రజలు కూడా పంటలు భారీగానే పండిస్తున్నారు. అయితే ఈ నీటికి ఆ స్థాయిలో ఎందుకు అంతలా వేడి వస్తుందో తెలుసుకోవడానికి మరింత లోతుగా పరిశోధనలు చేయాల్సి ఉందని” శాస్త్రవేత్తలు అంటున్నారు.
భవిష్యత్తులో ఏమైనా ఉపయోగం ఉంటుందా?
వేడి నీటిని అనేక పరిశోధనల్లో ఉపయోగిస్తుంటారు. వస్తువుల తయారీలోనూ వినియోగిస్తుంటారు. సిమెంట్, బ్లీచింగ్ పౌడర్, ఇతర రసాయనాల తయారీలో వేడినీరును ఉపయోగిస్తుంటారు. అలా నీటిని వేడి చేయడానికి చాలా వరకు విద్యుత్ ఉపయోగిస్తుంటారు. అయితే ఈ ప్రాంతంలో బొగ్గు విస్తారంగా లభ్యమవుతున్న నేపథ్యంలో ఇక్కడ సిమెంట్ తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే బాగుంటుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రాంతంలో 1/70 యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడం అంత సులభం కాదు. దానికి అనేక రకాల చట్టాలను సవరించాల్సిన అవసరం ఉంటుంది. మరి ప్రభుత్వం ఏ దిశగా సవరణలు చేస్తుందో చూడాల్సి ఉంది.