Mysterious Snake Bite Case: ఈ భూమి మీద ప్రమాదకరమైన జంతువులలో ముందు వరుసలో ఉండేది పాము. పాములలో అనేక రకాలు ఉన్నప్పటికీ.. విషం ఉండే పాములు అత్యంత ప్రమాదకరమైనవి. వీటిలో ఉండే విష తీవ్రత వల్ల ప్రత్యర్థి జంతువులు ప్రాణాలు కోల్పోతుంటాయి. అయితే కాటు వేసే విధానంలో త్రాచు రకానికి చెందిన పాములు అత్యంత ప్రమాదకరమైనవి. త్రాచులో నల్ల, ఎర్ర, కోడె రకాలకు చెందిన సర్పాలు అత్యంత ప్రమాదకరమైనది.. వీటిలో విష తీవ్రత అధికంగా ఉంటుంది.. ఇవి కాటు వేస్తే ప్రాణాలు వెంటనే పోతాయి.. వీటి విషం మనిషి నాడీ వ్యవస్థ మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అందువల్లే ఈ సర్పాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పెద్దలు చెబుతుంటారు.
త్రాచు రకానికి చెందిన పాములు పగబడితే వెంటాడుతుంటాయి. ఎంత దూరమైనా ప్రయాణిస్తాయి.. సినిమాల్లో చూపించిన మాదిరిగానే వెంటపడి వస్తాయి. త్రాచుపాములపగా అత్యంత తీవ్రమైనది కాబట్టే.. తోక తొక్కిన త్రాచు లాగా వెంట పడుతున్నావు అనే సామెత పుట్టింది. త్రాచుపాములను తొక్కితే అవి పగబడతాయి.. తొక్కిన జంతువును కాటు వేసేదాకా అవి వదిలి పెట్టవు. ఎంత దూరమైనా సరే ప్రయాణిస్తుంటాయి. ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చిన సరే వెనకడుగు వేయవు.
సాధారణంగా త్రాచుపాములకు పగ ఉంటుంది.. పైగా అవి ప్రత్యర్థి జంతువులను కాటు వేయడంలో తీవ్రమైన నేర్పరితనాన్ని ప్రదర్శిస్తుంటాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో ఓ త్రాచు పాము భిన్నంగా వ్యవహరిస్తోంది. పగ అనే పదానికి పర్యాయపదంగా నిలుస్తోంది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బొంకూరు గ్రామంలో 20 8 సంవత్సరాల ఓ యువకుడు డ్రైవర్గా పనిచేస్తున్నాడు.. అయితే ఇతని త్రాచుపాము గత నెలలో కాటు వేసింది.. దీంతో అతడి వెంటనే చికిత్స చేయించుకున్నాడు.. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.. అయితే అదే పాము మరోసారి కాటు వేసింది.. దీంతో అతడు ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకున్నాడు. చికిత్స చేయించుకొని ఇంటికి రాగానే మళ్లీ ఆ పాము కాటు వేసింది.
ఇలా నెల రోజుల వ్యవధిలో అతడిని పాము ఏడు సార్లు కాటు వేసింది.. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.. ఏం జరుగుతుందో తెలియక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఒకవేళ అతడు గనుక చూడకుండా ఆ పామును తొక్కి ఉంటే పగబట్టి ఉంటుందని.. అందువల్లే ఇలా కాటు వేస్తోందని చుట్టుపక్కల వారు అంటున్నారు.. అయితే ఈసారి కాటు వేయడానికి వచ్చినప్పుడు ఆ పామును మట్టు పెట్టాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. సినిమాల్లోనే పాము పగ పడుతుందని చూశామని.. కానీ నిజ జీవితంలో కూడా ఇలా జరుగుతుందంటే ఆశ్చర్యంగా ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.
జగిత్యాల జిల్లాలో విచిత్ర ఘటన.. నెల రోజుల్లోనే ఏడుసార్లు కాటు వేసిన పాము
గొల్లపల్లి మండలం, బొంకూరు గ్రామంలో డ్రైవర్గా పని చేసుకుంటున్న 28 ఏళ్ల యువకుడుని గత నెలలో కాటేసిన పాము
చికిత్స చేయించుకోవడంతో తప్పిన ప్రాణాపాయం
అయితే మరోసారి కాటేయడంతో.. ఆసుపత్రిలో చికిత్స తీసుకొని ఇంటికి… pic.twitter.com/ASnrY5vLBX
— Telugu Scribe (@TeluguScribe) November 5, 2025