ముంబై వరుస రెండు ఓటముల తర్వాత ఎట్టకేలకు విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజా్ పరుగుల కోసం శ్రమించాల్సి వచ్చింది. కెప్టెన్ రాహుల్, మన్ దీప్ బంతికో పరుగు చొప్పున చేయగలిగారంతే. పవర్ ప్లే ముగిసే సరికి పంజాబ్ మన్ దీప్ వికెట్ కోల్పోయి 38 పరుగులు చేసింది. ఆ తర్వాత పొలార్డ్ ఒకే ఓవర్లో గేల్, రాహుల్ ల వికెట్లు తీసి పంజాబ్ ను గట్టి దెబ్బ తీశాడు. వెంటనే పూరన్ ను బుమ్రా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అయితే దీపప్ హుడా 28 ఆదుకున్నారు.

స్పిన్నర్లు కృనాల్, చాహర్ పొదుపుగా బౌలింగ్ చేసినా.. బౌల్డ్ బౌలింగ్ లో ఇద్దరూ స్వేచ్ఛగా పరుగులు చేశారు. వీరి భాగస్వామ్యం తో పంజాబ్ మెరుగైన స్థితికి చేరుకుంది. లక్ష్య చేధనలో ముంబయి తడబడింది. 15 ఓవర్ల వరకు ఆ జట్టు ఆట చూస్తే మరో ఓటమి తప్పదనే అనిపించింది. కానీ పంజాబ్ చివర్లో పట్టు కోల్పోయింది. రవి బిష్ణోయ్ వరుస బంతుల్లో రోహిత్, సూర్యకుమార్ లను ఔట్ చేసి పంజాబ్ కు అదిరే ఆరంభాన్నిచ్చాడు. డికాక్ సౌరభ్ తివారి నిలకడగా ఆడినా.. స్కోరు వేగం పెంచలేకపోయారు. పదో ఓవర్లో జట్టు స్కోరు 61 వద్ద షమి.. డికాక్ ను బౌల్డ్ చేయడంతో ముంబయికి ఇబ్బందులు తప్పలేదు. 16 వ ఓవర్లో తివారి ఔటయ్యేసరికి స్కోరు 92 పరుగులే.
అయితే 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అర్ష్ దీప్ బౌలింగ్ లో హర్ ప్రీత్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన హార్దిక్ చివరి 4 ఓవర్లలో చెలరేగిపోయాడు. పొలార్డ్ కూడా కొన్ని భారీ షాట్లు ఆడటంతో మ్యాచ్ ముంబయి వైపు తిరిగింది. షమి వేసిన 19వ ఓవర్లో చివరి నాలుగు బంతులకు వరుసగా 4, 2, 4, 6 రాబట్టిన పాండ్య మ్యాచ్ ను ముగించాడు. 4 ఓవర్లలో 40 పరుగులతో కష్టంగా కనిపించిన ఛేదన ఒక ఓవర్ మిగిలుండగానే పూర్తయింది.