Mock Drills: జమ్ము కాశ్మీర్లోని పహల్గాం సంఘటన తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి యుద్ధ వాతావరణం నెలకొంది. పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాలపై భారత్ వరుసగా దాడులు జరుపుతోంది. అయితే అంతకుముందే మంగళవారం నాడు కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్, భారత్ మధ్య యుద్ధం జరిగితే దేశంలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో ముందే అంచనా వేశారు. అంతేకాకుండా యుద్ధ పరిస్థితులు వస్తే ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలో తెలియచెప్పాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా దేశంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే బుధవారం నుంచి దీనిని నిర్వహించనున్నారు. ఈ మాక్ డ్రిల్ ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నారు అంటే?
Also Read: ఆర్మీకి పూర్తిస్థాయిలో స్వేచ్ఛ.. నేడు స్వయంగా వీక్షణ: ఆపరేషన్ సింధూర్ లో మోడీ మార్క్!
రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దేశ మొత్తంలోని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను కేటగిరీల వారీగా విభజించారు. ఆయా కేటగిరీలో కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో దీనిని ఏర్పాటు చేయనున్నారు. వీటిలో
కేటగిరి -1 లో..
దేశ రాజధాని ఢిల్లీ లోని కేంద్రం లో నిర్వహించనున్నారు.
కేటగిరి-2 లో..
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, తెలంగాణలోని హైదరాబాద్లో నిర్వహించనున్నారు.
అరుణాచల్ ప్రదేశ్ లోని ఆలోగ్, ఇటానగర్, అవాంగ్, హాయులింగ్.
అస్సాం రాష్ట్రంలోని బొంగైగావోన్, దిబ్రుఘడ్, డుబ్రి, గోల్పారా, జోరుహాట్, శిబ్ సాగర్, టిన్ సుకియా, తేజ్ పూర్, డిగ్బోయ్, దిలీజన్, గువాహాటి, రంగియా, నమ్రుప్, నజీరా, నార్త్ లక్ష లో నిర్వహిస్తారు.
ఒడిశా రాష్ట్రంలోని బలాసోర్, కోరనాపుట్, భువనేశ్వర్, గోపాల్పూర్, హీరాకుడ్, పారాదీప్, రోర్కెలా, భద్రక్, దేంకనాల్, జగత్సింగ్ పూర్ కేండ్రాపాడ్.
పంజాబ్ లోని అమృత్ సర్, భటిండా, ఫిరోజ్ పూర్, గుర్ దాస్ పూర్, జలంధర్, లుథియానా, పటియాలా, పఠాన్ కోట్, అడాంపూర్, బర్ణాలా ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు.
ఈ మాక్ డ్రిల్ సందర్భంగా ఆపద సమయంలో ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టుకోవాలి అనే విషయాలను చెబతారు. విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు వలె సైరన్ వేస్తారు. దీంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. నగరాల్లో మొత్తం విద్యుత్ ఆగిపోతుంది. వైమానిక దాడులు గుర్తించకుండా బ్లాక్కౌట్ ఎత్తుగడను ఉపయోగించనున్నారు. అలాగే కమ్యూనికేషన్ వ్యవస్థను దెబ్బ తీసేందుకు పవర్ ప్లాంట్స్, మిలిటరీ ఏరియాస్ ను గుర్తించకుండా చేయడం భారత లక్ష్యం.అలాగే హై రిస్క్ జోన్లలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం. పౌరులకు ప్రత్యేకంగా యుద్ధ విన్యాసాలను తెలపడం. స్కూళ్లు, కళాశాలల్లో కమ్యూనిటీ సెంటర్లలో రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవడం వంటి చేస్తారు. మాక్ డ్రిల్ సందర్భంగా యుద్ధం పరిస్థితులు వస్తే ఎలా ఎదుర్కోవాలి? ఎలా అప్రమత్తంగా ఉండాలి? అనే విషయాలను చెప్పనున్నారు. యుద్దాన్నిఎదుర్కోవడం అంటే కేవలం సైనికులు మాత్రమే పాల్గొనడం కాదు.. దేశంలోని ప్రతీ పౌరుడు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేయనున్నారు.