Balakrishna: అమరావతి రాజధాని( Amravati capital ) పునర్నిర్మాణ పనులకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. గత అనుభవాల దృష్ట్యా వీలైనంత త్వరగా అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఇదే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మూడేళ్లలో ప్రజా రాజధాని అమరావతి అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు పనితీరుపై తనకు అపారమైన నమ్మకం ఉందని కూడా చెప్పుకొచ్చారు. మూడేళ్లలో సీఎం చంద్రబాబు అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేస్తారని కూడా వచ్చారు. అయితే గత అనుభవాల దృష్ట్యా అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు సమాంతరంగా ప్రైవేటు సంస్థలకు కేటాయించిన పరిశ్రమలు, సంస్థలు ఏర్పాటు కావాలని చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారు. అందుకు తగ్గట్టుగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి అదనంగా భూములు కేటాయించారు.
Also Read: ఆర్మీకి పూర్తిస్థాయిలో స్వేచ్ఛ.. నేడు స్వయంగా వీక్షణ: ఆపరేషన్ సింధూర్ లో మోడీ మార్క్!
* ప్రత్యేక గుర్తింపు..
తెలుగు రాష్ట్రాల్లో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ( Basava tharakam Cancer Hospital)ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పటివరకు వేలాదిమంది క్యాన్సర్ రోగులకు, బాధితులకు అండగా నిలిచింది సదరు ఆసుపత్రి. ఎంతోమంది మృత్యుంజయులుగా నిలిచి ప్రాణాలు నిలబెట్టుకున్నారు. అంతలా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి తీర్చిదిద్దారు చైర్మన్ నందమూరి బాలకృష్ణ. తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్న
.. బసవతారకం ఆసుపత్రికి అండగా నిలుస్తూ వస్తున్నారు. తాజాగా అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి యూనిట్ ప్రారంభించేందుకు 15 ఎకరాల భూమిని కేటాయించారు. ఇటీవల బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ, ఆసుపత్రి వ్యవహారాలు చూసే కాటమనేని భాస్కర్ పరిశీలించారు. భవనం ప్రారంభోత్సవ పనులకు నిర్ణయించారు. అయితే తాజాగా బసవతారకం ఆసుపత్రి నిర్మాణానికి అదనంగా భూమిని కేటాయిస్తూ సిఆర్డిఏ కీలక తీర్మానాలు చేసింది.
* అందరి ఆమోదంతో అమరావతి..
2014లో టిడిపి( Telugu Desam Party ) అధికారంలోకి వచ్చింది. అందరి ఏకాభిప్రాయంతో అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది. 33 వేల ఎకరాలను రైతుల స్వచ్ఛందంగా అమరావతి రాజధానికి అందించారు. కోర్ క్యాపిటల్ తో పాటు నవ నగరాలు నిర్మించాలన్న లక్ష్యంతో ముందడుగు వేశారు సీఎం చంద్రబాబు. ఒకవైపు ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు ప్రైవేటు సంస్థలకు అమరావతిలో భూములు కేటాయించారు. అందులో భాగంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి పదిహేను ఎకరాల భూములను కేటాయించారు. అయితే అప్పట్లో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి కేటాయించిన స్థలంలో భవన నిర్మాణానికి పావులు కలిపారు చైర్మన్ నందమూరి బాలకృష్ణ. అయితే ఇంతలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం.. అమరావతి రాజధాని నిర్వీర్యం కావడంతో ఆ అంశం మరుగున పడిపోయింది. అయితే ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో.. అనుబంధంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి చైర్మన్ నందమూరి బాలకృష్ణ ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేటాయించిన 15 ఎకరాల భూమితో పాటు అదనంగా మరో ఆరు ఎకరాలను తాజాగా కేటాయించింది సిఆర్డిఏ.
* ప్రపంచానికే తలమానికం..
బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ప్రపంచానికే తలమానికం. ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఆసుపత్రికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చేవి. రాష్ట్ర విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో విభిన్న రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. 2014లో ఏపీలో టిడిపి అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలో టిఆర్ఎస్ విజయం సాధించింది. రాజకీయంగా ఈ రెండు పార్టీలు విభిన్నమైనవి. అయినా సరే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చాయి. అయితే ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సిన్ మారింది. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడం.. అమరావతి రాజధానికి ఎనలేని ప్రాధాన్యం ఇవ్వడం.. వంటి కారణాలతో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ఏకంగా 21 ఎకరాలను కేటాయించారు. అదే సమయంలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి యాజమాన్యం కూడా అమరావతిలో భవన నిర్మాణానికి చురుగ్గా పావులు కదుపుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.