T Ration APP Telangana: తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డ్ ఉన్నవారి సౌకర్యం కోసం ’టీ–రేషన్’ అనే అత్యాధునిక మొబైల్ యాప్‌ను ఇటీవల ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా రేషన్ సేవలను ఇంటి నుంచే సులభంగా పరిశీలించవచ్చు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. సాంకేతికత ఆధారంగా రూపొందించిన ఈ యాప్, పౌరులకు పారదర్శకతను, సౌలభ్యాన్ని అందిస్తుంది. ఈ యాప్ ప్రధాన లక్ష్యం ఏమిటంటే, రేషన్ షాపులకు వెళ్లి ఎదురుచూడాల్సిన ఇబ్బందులను తగ్గిస్తుంది. మొబైల్‌లోనే అన్ని వివరాలు కనిపిస్తాయి. సమయం, శ్రమ ఆదా అవుతాయి.
యాప్‌లో ముఖ్య ఫీచర్లు..
’టీ–రేషన్’ యాప్ లో అన్ని ముఖ్య సమాచారం తెలుగు భాషలో లభిస్తుంది, కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లోని సామాన్యులకు కూడా అర్థమవుతుంది. మీ రేషన్ కార్డు యాక్టివ్‌గా ఉందా లేదా సస్పెండెడ్‌గా ఉందా అనేది తక్షణం తెలుసుకోవచ్చు. కార్డు ఆధార్‌తో సరిగ్గా లింక్ అయిందా లేదా పెండింగ్‌లో ఉందా అని తిరిగి చూడవచ్చు. మీ రేషన్ డీలర్ సంప్రదింపు నంబర్, షాప్ అడ్రస్, లొకేషన్ మ్యాప్‌తో కలిపి చూడొచ్చు. నెలవారీ రేషన్ కోటా, ఇప్పటివరకు ఎంత సరుక్కు (బియ్యం, చనా దాలు మొదలైనవి) పొందారో, మిగిలిన మొత్తం అంతా క్లియర్‌గా కనిపిస్తాయి. మునుపటి నెలల డ్రా వివరాలు, కొత్త అప్‌డేట్‌ల గుర్తింపు నోటిఫికేషన్లు. ఈ ఫీచర్లు ఈ కేవైసీ ప్రక్రియలతో ముడిపడి ఉంటాయి, కాబట్టి డేటా కచ్చితంగా ఉంటుంది.
ఉపయోగించే∙విధానం
యాప్‌ను ఉపయోగించడం చాలా సులభం. గూగుల్ ప్లే స్టోర్‌లో ’టీ–రేషన్’ టైప్ చేసి శోధించండి. అధికారిక యాప్‌ను ఫ్రీగా ఇన్‌స్టాల్ చేయండి. మొదటిసారి ఓపెన్ చేసినప్పుడు మీ రేషన్ కార్డు నంబర్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో లాగిన్ చేయండి. మొబైల్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేయండి. లాగిన్ అయిన తర్వాత మెయిన్ స్క్రీన్‌లో అన్ని వివరాలు కనిపిస్తాయి. మెనూల ద్వారా స్పెసిఫిక్ సెక్షన్లకు వెళ్లవచ్చు. అండ్రాయిడ్, ఐఓఎ రెండింటిలోనూ త్వరలో అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఇంటర్నెట్ లేకపోతే ఆఫ్‌లైన్ మోడ్‌లో కూడా కొన్ని ఫీచర్లు పనిచేస్తాయి.
ప్రయోజనాలు ఇవీ..
ఈ యాప్ రేషన్ వ్యవస్థలో పారదర్శకతను బలోపేతం చేస్తుంది. లబ్ధిదారులు తమ కోటాను పూర్తిగా పొందుతున్నారా అని తనిఖీ చేసుకోవచ్చు, డీలర్లపై దెబ్బ తీస్తుంది. ప్రభుత్వం లక్ష్యం పీడీఎస్(పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్)ను డిజిటల్‌గా మార్చడం. ఇది మహిళలు, రోజువారీ కూలీలు, గ్రామీణ ప్రజలకు మరింత సహాయకరం. ఏదైనా సమస్యలు ఉంటే యాప్‌లోనే ఫిర్యాదు చేయవచ్చు.
తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ గవర్నెన్స్‌లో ముందంజలో ఉంది. ఇటీవల మీసేవా వాట్సాప్ ఆప్ ద్వారా సర్వీసులు ఆర్డర్ చేయడం, యూరియా యాప్ ద్వారా ఎరువులు ట్రాక్ చేయడం అందుబాటులోకి వచ్చాయి. ’టీ–రేషన్’ కూడా ఇలాంటి డిజిటల్ పరివర్తనలో భాగం.