MLC Kavitha: వీటికి బలం చేకూర్చే విధంగా కేసీఆర్ కు కవిత రాసినట్టుగా ఓ లేఖ బయటికి వచ్చింది. గురువారం సాయంత్రం మీడియాలో దీనిపై విపరీతమైన చర్చ మొదలైంది. కెసిఆర్ కు రాసిన లేఖ.. కవిత అమెరికా నుంచి తెలంగాణకు రావడానికి రెండు రోజుల ముందే ఇది లీక్ కావడం సంచలనం సృష్టిస్తోంది. ఈ లేఖ ద్వారా కవిత చెప్పాలనుకున్న విషయాలు కుండబద్దలు కొట్టారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ” కవితకు పొలిటికల్ యాంబిషన్స్ చాలా ఉన్నాయి. కాకపోతే కెసిఆర్ ఆమెకు ఎప్పటికప్పుడు పగ్గాలు వేస్తున్నారు. తన రాజకీయ వాసుడిగా ఇప్పటికీ కేటీఆర్ నే కెసిఆర్ నమ్ముతున్నారు.. కవితకు ఉన్న ఆశలను మొత్తం తుంచేస్తున్నాడు. ఎప్పటికప్పుడు ఆమెను వెనక్కి లాగుతున్నాడు. చివరికి హరీష్ రావును కూడా కేసీఆర్ పక్కన పెట్టారు.. గతంలో అనేక సందర్భాల్లో హరీష్ రావును కేసీఆర్ పూర్తిగా పక్కన పెట్టాడు. తన రాజకీయ వారసుడు కేటీఆర్ మాత్రమేనని స్పష్టం చేశాడు. మొదటి వరంగల్ సభలో కూడా ఇదే చెప్పాడు. కాకపోతే కేడర్ లో ఇప్పటికీ కేటీఆర్ పట్ల యాక్సెప్టెన్సీ లేదు. అందువల్లే పార్టీ అధ్యక్ష పదవిని ఇంతవరకు కేటీఆర్ కు కేసిఆర్ ఇవ్వలేదు. వాస్తవానికి రెండవ పర్యాయం భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చినప్పుడు కేటీఆరే అనధికారికంగా అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా కొనసాగాడని” రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
కవిత మద్యం కేసు
కవిత పేరు ప్రముఖంగా వినిపించిన మద్యం కేసులో అవినీతి విషయాన్ని పదేపదే కొంతమంది ప్రస్తావిస్తున్నారు. వాస్తవానికి కవిత మాత్రమే కాదు ఇప్పుడు చాలా రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలు.. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు మద్యం కుంభకోణాలలో ఇరుక్కుపోయినవే. సినీ యాక్టర్లు ఎలాగైతే కళా సేవ చేస్తారో.. రాజకీయ నాయకులు కూడా అలాగే ప్రజా సేవ చేస్తారు. మొదటి దాంట్లో నమ్మకం లేకపోతే.. రెండవ దాంట్లో కూడా నమ్మకాన్ని వెతుక్కోకూడదు. ఇక ఇప్పటికే కవిత ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తూనే ఉంది. చివరికి ఆమె ఫోన్ల ట్యాపింగ్ కూడా జరిగిందని అప్పట్లో కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ఆమె మీద కేసీఆర్ కూడా నిఘా పెట్టాడని ఆరోపించారు. ఇప్పటికే ఆమె జాగృతిని బలోపేతం చేస్తోంది. విస్తరిస్తోంది. మొన్నటికి మొన్న సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామని ఓపెన్ గానే చెప్పేసింది. ఇప్పుడేమో ఏకంగా లేఖ రాసింది. కవితకు తెర వెనుక హరీష్ రావు సపోర్ట్ ఉందని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక వీటకి బలం చేకూర్చే విధంగా కేటీఆర్ హరీష్ రావు ఇంటికి వెళ్ళాడు. దాదాపు నాలుగు గంటలపాటు మాట్లాడాడు. పైకి గులాబీ మీడియా ఏదో కవరింగ్ ఇస్తోంది కానీ.. లోపల ఏదో మండుతోంది.. మాడు వాసన కూడా వస్తోంది. ఆ విషయాన్ని మిగతా మీడియా సంస్థలు గుర్తుపట్టలేవా? బొంబాట్ చేయలేవా? ఒకటి మాత్రం స్పష్టం.. కెసిఆర్ పాలనను నిన్న కవిత ప్రశ్నించింది. నేడు లేక రూపంలో ముందుగానే బయటపెట్టింది. తర్వాత ఏం జరుగుతుందనేది వేచి చూస్తే కానీ తెలియదు.
మై డియర్ డాడీ’ అంటూ.. కేసీఆర్కు కవిత సంచలన లేఖ#Kavitha #KCR #TelanganaPolitics #BRSNews #KCR #KalvakuntlaKavitha #WarangalSabha #BRSLeadership #PoliticalBuzz pic.twitter.com/GLLZKH9vzO
— TV5 News (@tv5newsnow) May 22, 2025