MLC Kavitha Congress Government: సరిగ్గా కొన్ని నెలల క్రితం ఆదిలాబాద్ జిల్లాలో తన సమస్య చెప్పుకోవడానికి ఒక రైతు ప్రభుత్వ కార్యాలయానికి వచ్చాడు. అక్కడే ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆ రైతు మీద అత్యంత దురుసుగా ప్రవర్తించాడు. రైతు ఎంత చెప్పినా సరే ఆ కానిస్టేబుల్ వినిపించుకోలేదు. ఈ వ్యవహారం కాస్త వీడియో రూపంలో సామాజిక మాధ్యమాల ద్వారా బయట ప్రపంచానికి తెలిసింది.. ప్రభుత్వం ఎంత బద్నాం కావాలో.. అంత బద్నాం అయింది. ఆ కానిస్టేబుల్ ని ప్రభుత్వం సస్పెండ్ చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.
Also Read: చంద్రబాబు దశ, ఆంధ్రా దిశ రెండూ మారనున్నాయా?
భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఘనకార్యాలను అధికారులు చాలానే చేశారు . ఖమ్మం జిల్లాలో నాగార్జునసాగర్ నీళ్లు అడిగిన పాపానికి రైతుల చేతులకు సంకెళ్లు వేసి తీసుకెళ్లారు. గౌరవెల్లి నిర్వాసితులను రాత్రికి రాత్రి ఈడ్చుకు వెళ్లి బయటపడేశారు. ఇక మల్లన్న సాగర్ గ్రామాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పరిణామాలు మొత్తం భారత రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా మారి.. 2023లో అధికారాన్ని దూరం చేశాయి. ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్న పర్వాలేదు. కానీ ప్రజలను ఇబ్బంది పెట్టే నిర్ణయాలు మాత్రం అధికారాన్ని దూరం చేస్తాయి.
పై ఉపోద్ఘాతంలో చెప్పుకున్నట్టు ఆదిలాబాద్ ఘటన ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడితే.. ఇప్పుడు మరో ఘటన ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. జగిత్యాల జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. తన ఇంటికి సంబంధించిన సమస్య పరిష్కారానికి మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన దివ్యాంగుడు రాజ గంగారం వచ్చాడు. జగిత్యాల కలెక్టరేట్ లోని ప్రజావాణి కార్యక్రమంలో తన సమస్యను చెప్పుకోవడానికి ప్రయత్నించాడు. ఇదే సమయంలో కలెక్టర్ వస్తున్నాడని చెప్పి ఆ దివ్యాంగుడిని పోలీసులు ఈడ్చుకుని వెళ్లారు. ఇంత జరుగుతున్నప్పటికీ కలెక్టర్ సత్యప్రసాద్ చూసి చూడకుండా వెళ్లిపోయారు. ఇదే వీడియోను భారత రాష్ట్ర సమితి శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రభుత్వానికి చురకలు అంటించారు. ప్రజా ప్రభుత్వమని పైకి చెప్పుకోవడం కాదు.. ఆచరణలో కూడా ఉండాలని విమర్శించారు. కవిత ట్వీట్ తోనైనా రేవంత్ ప్రభుత్వం మారుతుందా.. రేవంత్ ప్రభుత్వం లో అధికారులు మారుతారా.. ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.
ప్రజాపాలన అంటే ఇదేనా?
ప్రజావాణిలో గోడు చెప్పుకునేందుకు వచ్చిన దివ్యాంగుడిని కలెక్టర్ ఎదుటే ఈడ్చి వీల్ చైర్ నుంచి కిందపడేసి లాక్కెళ్లడం అత్యంత దుర్మార్గం
ఈ ఘటన కు బాధ్యుడైన కానిస్టేబుల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, తన కళ్లెదుటే ఇంతటి దారుణం జరుగుతున్నా స్పందించని జగిత్యాల… pic.twitter.com/RJXfoM0CkW
— Kavitha Kalvakuntla (@RaoKavitha) August 11, 2025