Praja Palana: ప్రజాపాలన కింద ప్రభుత్వం ఐదు గ్యారంటీలకు ఇటీవల ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఆయా స్కీంల లబ్ధి పొందాలనుకునే వారికి ఒక ముఖ్యమైన సమాచారం. సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల దరఖాస్తులపై సచివాలయంలో సమీక్ష చేశారు. ఇందులో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అవేంటో తెలుసుకుందాం.
1.09 కోట్ల దరఖాస్తులు..
ఇక ప్రజాపాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 1,09,01,255 దరఖాస్తులు వచ్చాయి. జనవరి 12 నాటికే రికార్డు టైంలో డేటా ఎంట్రీ ప్రక్రియ కూడా పూర్తి చేశారు. ఇందులో కొందరు ఒకటికన్నా ఎక్కువ దరఖాస్తులు సమర్పించినట్లు ఆన్‌లైన్ నమోదు సమయంలో గుర్తించారు. మొత్తం దరఖాస్తుల్లో 2.82 దరఖాస్తులు రెండ అంతకన్నా ఎక్కువగా వచ్చినట్లు గుర్తించారు. మరోవైపు రేషన్‌కార్డులు, ఆధార్ కార్డుల నంబర్లు లేకుండా చాలా మంది అప్లికేషన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నంబర్లు తప్పుగా ఉన్న దరఖాస్తులు కూడా ఉన్నట్లు సమాచారం. దీంతో పథకాలకు అర్హత కోల్పోయే అవకాశం ఉంది.
సీఎం కీలక సూచన..
అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఈ అంశంపై అధికారులకు కీలక సూచనలు చేశారు. అర్హులు నష్టపోకుండా చూడాలని ఆదేశించారు. ఒకటికన్నా ఎక్కువ, వివరాలు తప్పుగా ఉన్న దరఖాస్తులను మరోసారి పరిశీలించాలని ఆదేశించారు. దీంతో నిజమైన అర్హులకు నష్టం జరుగకుండా ఉంటుందని తెలిపారు. అర్హుల సంఖ్య పెరుగుతుందని పేర్కొన్నారు.