Jupalli Sensational Comments: ఏ మనిషినైనా సరే ఆశావహ దృక్పధం ఉండాలి. సాధిస్తాను అనే సంకల్పం ఉండాలి. గెలుస్తాను అని నమ్మకం ఉండాలి. అలా అయితేనే ముందుకు వెళ్ళగలుగుతారు. అలాకాకుండా నిరాశతో, నిస్పృహతో, భయంతో ఉంటే ఎప్పటికైనా సరే ఓడిపోతారు. ప్రస్తుతం 30 లక్షణాలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో నాయకుల్లో ఒక రకమైన భయం కనిపిస్తోంది. గులాబీ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరినప్పటికీ.. ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్ నోటీసులు ఇవ్వడంతో ఒక్కసారిగా స్వరం మార్చారు. తాము అభివృద్ధినిధుల కోసం మాత్రమే ముఖ్యమంత్రిని కలిసినట్టు కవరింగ్ ఇచ్చారు. ఇందులో ఇంకా కడియం శ్రీహరి, మరో ఎమ్మెల్యే వివరణ ఇవ్వాల్సి ఉంది. వీరు మాత్రమే కాదు, మిగతా ఎమ్మెల్యేలు కూడా భయం భయంతోనే ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు రైతులు యూరియా కొరతతో ఇబ్బంది పడుతుంటే విదేశాలకు వెళ్తున్నారు. రైతులు ధర్నా చేస్తుంటే విదేశాల్లో ఉండి వారు వినోదం చూస్తున్నారు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రమే కాదు.. భయపడుతున్న వారి జాబితాలోకి ఇప్పుడు ఈ జాబితాలోకి మంత్రులు చేరిపోయారు.
తాజాగా మంత్రి జూపల్లి కృష్ణారావు చేతులెత్తేశారు.. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ లోని బోద్ ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని అక్కడి ప్రజలు ఆయనను డిమాండ్ చేశారు. దీనిపై కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ” వచ్చేసారి నేను గెలుస్తానో లేదో తెలియదు. ఒకవేళ నేను గెలిచినా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో తెలియదు. అందువల్లే నేను ప్రజలకు ఎటువంటి హామీ ఇవ్వవలేను.. నా జేబులో నుంచి ఖర్చుపెట్టే డబ్బు అయితే చెప్పగలను. ప్రభుత్వం నుంచి వచ్చేదానికి నేను హామీ ఇవ్వలేను” అని మంత్రి స్పష్టం చేశారు.. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారాయి. మరో రెండు పర్యాయాలు తానే ముఖ్యమంత్రి అని రేవంత్ చెప్పుకుంటుంటే.. కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి.
ఇటీవల కాలంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అదృష్టం మీద నేరుగా విమర్శలు చేస్తున్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వలేదని మండిపడుతున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలకే గట్టి కౌంటర్ ఇస్తున్నారు. పుచ్చుకుపల్లి మాత్రం ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాదని స్పష్టం చేస్తున్నారు.. అంటే ఇప్పుడు ప్రజల్లో కాంగ్రెస్ పట్ల ఆగ్రహం ఉన్నట్టే కదా.. ప్రభుత్వం చేపడుతున్న ఏ పని కూడా ప్రజల్లోకి వెళ్లడం లేదనే కదా.. మరి దీనిపై ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారు.. ఎలాంటి ప్రకటన చేస్తారనేది చూడాల్సి ఉంది. అన్నట్టు జూపల్లి కృష్ణారావు మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తొలి రోజుల్లో ఆయన నియోజకవర్గంలో జరిగిన ఓ ఘటన సంచలనం రేపింది. దాని వెనుక ఉన్నది కృష్ణారావు అని ప్రచారం కూడా జరిగింది. అప్పటినుంచి ఆయన ఏ సభలో కూడా ఆశావాహ దృక్పథంతో మాట్లాడటం లేదని గులాబీ నాయకులు అంటున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి అర్థమైంది కాబట్టి మంత్రులు వాస్తవాలు మాట్లాడుతున్నారని.. కృష్ణారావు జ్ఞానోదయం అయిందని.. మిగతా వారికి కూడా త్వరలోనే అవుతుందని గులాబీ నేతలు అంటున్నారు.
బ్రేకింగ్ న్యూస్
చేతులెత్తేసిన జూపల్లి!
వచ్చేసారి మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో..? లేదో..? తెలియదు.. నేను మళ్లీ గెలుస్తానో..? లేదో తెలియదు!
ఇందిరమ్మ నమూనా గృహం ప్రారంభోత్సవం సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
నేను హామీలు ఇవ్వను.. ఎందుకంటే వచ్చేసారి మా… pic.twitter.com/h2eANDSOZp
— Telugu Scribe (@TeluguScribe) September 12, 2025